కిరాణా సేవల విస్తరణలో అమెజాన్‌

31 May, 2019 08:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ డాట్‌ ఇన్‌ భారత్‌లో తన సేవలను విస్తరించే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా నిత్యావసరాల సరఫరా సేవల విభాగమైన ‘అమెజాన్‌ ప్యాంట్రీ’ ఏర్పాట్లను శరవేగంగా పెంచే పనిలోపడింది. వచ్చే ఆరు–ఏడు నెలల్లో ఈ సర్వీసులను 110 పట్టణాలకు విస్తరించేందుకు ప్రణాళిక రచించింది. గతేడాది నవంబర్‌ నాటికి 40 నగరాల్లో ప్యాంట్రీ సేవలుండగా.. మరో 70 నగరాల్లో సేవలను విస్తరించే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సంస్థ గ్రోసరీ విభాగ డైరెక్టర్‌ సౌరభ్‌ శ్రీవాత్సవ వెల్లడించారు. ప్యాంట్రీ సేవల్లో 500 బ్రాండ్లకు చెందిన.. స్టేపుల్స్, గృహ సరఫరా, వ్యక్తిగత సంరక్షణ వంటి దాదాపు 5,000 ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు