పేలవంగా పెన్నార్, శ్రీ పుష్కర్ లిస్టింగ్

11 Sep, 2015 01:20 IST|Sakshi
పేలవంగా పెన్నార్, శ్రీ పుష్కర్ లిస్టింగ్

ముంబై: పెన్నార్ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్, శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఈ రెండు కంపెనీలు బుధవారం స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. ఈ రెండు షేర్లు వాటి ఇష్యూల ధర కంటే తక్కువకే లిస్టయి, మరింత నష్టపోయాయి. పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కంపెనీ షేర్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) రూ.60 వద్ద లిస్టయింది. ఇష్యూ ధర రూ.65 కంటే ఇది 8% తక్కువ. చివరకు రూ.63 వద్ద ముగిసింది. మరోవైపు పెన్నార్ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ షేర్ రూ.177.95 వద్ద లిస్టయింది(ఇష్యూ ధర 178). ఆ తర్వాత మరింతగా పడిపోయింది. చివరకు 5% నష్టంతో రూ.169.5 వద్ద ముగిసింది. ఈ  ఐపీఓలకు పేలవ స్పందన లభించడంతో వీటి లిస్టింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉండగలదని విశ్లేషకులు అంచనా వేశారు.

>
మరిన్ని వార్తలు