పండగ వేళ పెట్రో భారాలు

13 Jan, 2019 12:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పండగ వేళ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రో భారాలు మోపాయి. గత మూడు రోజులుగా స్వల్పంగా పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు ఆదివారం మరింతగా భారమయ్యాయి. పలు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌ ధరలను లీటర్‌కు 49 నుంచి 60 పైసల మధ్య పెంచగా, డీజిల్‌ ధరలు లీటర్‌కు 59 నుంచి 75 పైసల వరకూ భారమయ్యాయి.

తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్‌ రూ 73.47కు ఎగబాకింది. ఇక డీజిల్‌ ధర లీటర్‌కు రూ 69.24కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ రూ 69.75కు పెరిగింది. డీజిల్‌ ధర లీటర్‌కు రూ 63.69కు చేరింది. ముంబైల్‌లో పెట్రోల్‌ ధర లీటర్‌ రూ 75.39 పలికితే, డీజిల్‌ ధర 62 పైసలు పెరిగి రూ 66.66కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ముడిచమురు ఉత్పత్తులను రోజుకు ఎనిమిదిలక్షల బారెల్స్‌కు పరిమితం చేయాలన్న సౌదీ అరేబియా నిర్ణయంతో పెట్రో ఉత్పత్తుల ధరలు భారమయ్యాయి.

మరిన్ని వార్తలు