కొనసాగుతున్న పెట్రో పరుగు

25 May, 2019 12:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ ఇంధన ధరలు వరుసగా మూడోరోజు కూడా  పుంజుకున్నాయి.  కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ సర్కార్‌ కొలువ దీరనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. మరోవైపు  ఇంధన ధరలు కూడా పెరుగుతూ వినియోగదారులకు భయపెడుతున్నాయి. శనివారం (మే 25) పెట్రోలు ధర 14 నుంచి 15 పైసలు పెరగ్గా.. డీజిల్ ధర 12 నుంచి 13 పైసల మేర పెరిగింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా  పలు మెట్రో నగరాల్లో పెట్రో,డీజిల్‌ ధరలు పెరిగాయి.  అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 1.46 శాతం పెరుగుదలతో 67.47 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 1.24 శాతం పెరిగి 58.63 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 
 
దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు

న్యూఢిల్లీ : పెట్రోలు రూ.71.53, డీజిల్ ధర రూ.66.57 
ముంబై :   పెట్రోలు రూ.77.14 , డీజిల్ ధర రూ.69.75 
చెన్నై:  పెట్రోలు రూ.74.25, డీజిల్ ధర రూ. 70.37
కోలకతా :  పెట్రోలు  రూ.73.60, డీజిల్ ధర రూ.68.33
హైదరాబాద్‌ : పెట్రోలు  రూ.75.86,  డీజిల్ రూ. 72.80
అమరావతి : పెట్రోలు రూ.75.86, డీజిల్ ధర రూ.71.75
విజయవాడ: పెట్రోలు రూ.75.27 డీజిల్  రూ.71.42 వద్ద కొనసాగుతోంది. 

కాగా  సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మే 19 నుంచి శనివారం (మే 25) వరకు.. అంటే వారం రోజుల వ్యవధిలో పెట్రోలు ధర 50 పైసలు, డీజిల్ ధర 60 పైసల మేర  పెరిగింది. దీంతో పెట్రో భారం మరింత పెరుగుతుందనే ఆందోళన వాహనదారుల్లో నెలకొంది

మరిన్ని వార్తలు