ఎక్స్చేంజ్ లో ఫోన్ కొనాలనుకుంటున్నారా?

4 Apr, 2017 20:01 IST|Sakshi
ఎక్స్చేంజ్ లో ఫోన్ కొనాలనుకుంటున్నారా?
ముంబై : ఎక్స్చేంజ్ ఆఫర్లతో వస్తువులు కొనుకొని ఇన్ని రోజులు పన్ను భారాన్ని తగ్గించుకుంటున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్. ఎక్స్చేంజ్ లో  ఓ వస్తువు కొన్నా ఇక జీఎస్టీ మోత మోగనుంది.  ఇన్ని రోజులు ఎక్స్చేంజ్ ఆఫర్లపై మార్కెట్ విలువ కంటే తక్కువకు లభిస్తున్న ధరకు మాత్రమే పన్ను కట్టేవారు. కానీ ఇకనుంచి అలా ఉండదట. జీఎస్టీ కింద సప్లయి విలువను లెక్కకట్టే డ్రాఫ్ట్ రూల్స్ ను ప్రభుత్వం ఏప్రిల్ 1న విడుదల చేసింది. సప్లయ్ అనేది సమగ్ర పదమని, దీనిలో కేవలం విక్రయం మాత్రమే ఆధారపడి ఉండదని, దీనిలోనే ఎక్స్చేంజ్, సరుకు బదలాయింపు కూడా కలిసి ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం.. కొత్త 24వేల రూపాయలున్న కొత్త ఫోన్ ను ఎక్స్చేంజ్ లో రూ.20వేలకు కొంటున్నామనుకోండి... అసలు ధర రూ.24 వేలపైనే ప్రస్తుతం జీఎస్టీని లెక్కకట్టనున్నారు. ఇన్నిరోజులు కేవలం 20వేల రూపాయల పైనే పన్ను చెల్లించేవారు.
 
ఎక్కువగా ఎక్స్చేంజ్ ఆఫర్లను పాత మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్ సెట్లు, కార్లపై ప్రకటిస్తుంటారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండింట్లోనూ ఈ ఎక్స్చేంజ్ లపై వివిధ స్కీమ్ లు అందుబాటులో ఉంటుంటాయి. సప్లయి విలువ, మార్కెట్ విలువ ఆధారంగానే ఉండాలని జీఎస్టీ డ్రాఫ్ట్ రూల్స్ లో పొందుపరచడంతో, ఇక ఎక్స్చేంజ్ ఆఫర్లపై కొనే వస్తువులపైనా జీఎస్టీ మోత మోగించనుంది. ఏజెంట్ ద్వారా ఏయిర్ ట్రావెల్ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు చెల్లించే సర్వీసులపైనా జీఎస్టీ డ్రాఫ్ట్ రూల్స్ ను పొందుపరిచారు. బేసిక్ ఫేర్ పై 5 శాతం చెల్లించాలని డ్రాఫ్ట్ రూల్స్ పేర్కొన్నాయి. అదే ఇంటర్నేషనల్ ట్రావెల్ కు అయితే 10 శాతం చెల్లించాలి. 
.   
మరిన్ని వార్తలు