అదిరిపోయే ఫీచర్లతో రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌

20 Nov, 2019 14:54 IST|Sakshi

సాక్షి, ముంబై: భారతీయ స్మార్ట్‌ఫోన్‌లో దాదాపు బడ్జెట్‌ ఫోన్లకే పరిమితమైన రియల్‌ మీ ఖరీదైన ఫోన్ల జాబితాలో అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో  ఒక ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ నుబుధవారం లాంచ్‌ చేసింది. ఇంప్పటికే చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చిన  రియల్‌  ఎక్స్‌ 2 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ఇపుడు భారత మార్కెట్లలో కూడా   తీసుకొచ్చింది. రియల్ మీ ఎక్స్2 ప్రోలో  రెండు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాదు దీంతోపాటు రియల్‌ ఎక్స్‌ 2  ప్రొ మాస్టర్‌ ఎడిషన్‌ను కూడా లాంచ్‌ చేసింది. 
 

ధరలు 
ప్రారంభ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర : రూ.29,999
హై ఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర :  రూ.33,999 
మాస్టర్‌ ఎడిషన​ 12 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్ ధర : రూ.34,999  

ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి ఆన్‌లైన్‌ స్టోర్ల ద్వారా ఈ నెల 26నుంచి అందుబాటులోకి రానున్నాయి. రియల్ మీ ఎక్స్2 ప్రో మాస్టర్ ఎడిషన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ గల ఒక్క వేరియంట్ లో మాత్రమే లభిస్తుంది. ఇది క్రిస్మస్‌నాటికి అందుబాటులోకి  వస్తుంది. 

రియల్‌ మి ఎక్స్‌ 2 ప్రో ఫీచర్లు
6.50 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 9పై 
1080x2400 పిక్సె ల్స్‌ రిజల్యూషన్‌
8జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ
16 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా
64+13 +8+ 2 ఎంపీ క్వాడ్‌ రియర్‌కెమెరా
4000ఎంఏహెచ్‌ బ్యాటరీ 

దీంతో పాటు రియల్‌మి ఎస్‌ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా కంపెనీ లాంచ్‌ చేసింది. 48 ఎంపీ ప్రైమరీ క్వాడ్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో  రెండు వేరియంట్లలో లాంచ్‌ చేసింది.  రూ. 9999, రూ 10,999 ధరలతో ఈ నెల 29 నుంచి విక్రయానికి లభ్యం.

మరిన్ని వార్తలు