భారత మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్ 9 రిలీజ్

20 Jul, 2020 15:16 IST|Sakshi

జూలై 24న అమ్మకాలు ప్రారంభం

ఎమ్‌ఐ.కామ్, అమెజాన్‌ల్లో లభ్యం

ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులోకి

స్టార్‌ఫోన్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రెడ్‌మి నోట్ 9' సోమవారం భారత మార్కెట్‌లో విడుదలైంది.జూలై 24న రెడ్‌మి నోట్9 అమ్మకాలను ప్రారంభించనుంది. ఈ ఫోన్ ఎమ్‌ఐ.కామ్, అమెజాన్ ఇండియాలో లభిస్తుంది. ఇది ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ధర రూ.11,999గా ఉంది. చైనా మొబైల్స్ త‌యారీదారు షియోమీ నుంచి వస్తున్న ఈ కొత్తమోడల్‌ రెడ్‌మి నోట్‌9 సీరీస్‌లో మూడవది. ఇప్పటికే ఈ నోట్9 సిరీస్‌లో రెడ్‌మి నోట్9 ప్రో, రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. షియోమి ఈ రెండింటి కంటే తక్కువ ధరకే రెడ్‌మి నోట్‌9ను తీసుకోచ్చింది. ఫోన్ ఆక్వా గ్రీన్, గ్రే ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. 

ఈ మోడల్‌ స్పెషిఫికేషన్లను పరిశీలిస్తే.. రెడ్‌మి నోట్‌9 స్మార్ట్‌ఫోన్‌ 6.53 అంగుళాల హెచ్‌డీ+డీస్‌ప్లేను కలిగి ఉంది. బ్యాటరీ సామర్థ్యం 5,020ఎంఏహెచ్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ర్యామ్‌ 4బీబీ, 6బీజీలు, అలాగే ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 64జీబీ, 128 జీబీ అందుబాటులో ఉన్నాయి. ముందుభాగంలో ఎడమ వైపు పంచ్ హోల్‌ కెమెరాను కలిగి ఉంది. దీనిలో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఫోన్ నాలుగు వెనుక కెమెరాలను కలిగి ఉంది. ఈ సెటప్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ (ఎఫ్ / 1.79 ఎపర్చరు), 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ (118-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ), 2-మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా (ఆటో ఫోకస్) ఉన్నాయి. ఫోన్ ప్రో వీడియో మోడ్‌తో కూడా వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ బ్లాస్టర్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, యూఎస్బీ టైప్‌-సీ సపోర్ట్‌ ఉంది.

మరిన్ని వార్తలు