రిలయన్స్‌కు డీల్‌ అనిశ్చితి సెగ

23 Dec, 2019 15:30 IST|Sakshi

సాక్షి,ముంబై : ఇంధన దిగ్గజ సంస్థలు సౌదీ అరామ్‌కో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) మధ్య జరిగిన మెగా డీల్‌కు బ్రేక్‌ పడనుందన్న వార్తలతో ఆర్‌ఐఎల్‌ స్టాక్‌మార్కెట్లో డీలా పడింది. 15 బిలియన్‌ డాలర్ల విలువైన ఈ డీల్‌పై అనిశ్చితి నెలకొనడంతో సోమవారం నాటి  ట్రేడింగ్‌ లో ఆర్‌ఐఎల్‌ షేరు 3 శాతానికి పైగా నష్టపోయింది. పన్నా ముక్తా తపతి చమురు గ్యాస్‌ క్షేత్రాల నుంచి ఆర్జించిన లాభాలలో 350 కోట్ల డాలర్ల(రూ. 24500 కోట్లు)ను మధ్యవర్తిత్వ బకాయిలను చెల్లించాల్సింది ఉందనీ,  ఈ బకాయిలను చెల్లించకముందే చమురు, కెమికల్స్‌ బిజినెస్‌లో 20 శాతం వాటాను సౌదీ అరామ్‌కో కంపెనీకి రిలయన్స్‌ విక్రయిం‍చినట్లు ప్రభుత్వం వివరించింది.  ఈ ఒప్పందాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కేంద్రం పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే తాము బకాయిలు చెల్లించవలసిన అవసరంలేదంటూ ఆర్‌ఐఎల్‌ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు రిలయన్స్‌ కౌంటర్లో అమ్మకాలకు ఎగబడ్డారు.  రిలయన్స్‌తోపాటు  పెట్రో నెట్‌ ఎనర్జీ, గోవా కార్బన్‌  లాంటి ఎనర్జీ షేర్లు కూడా నష్టపోవడం గమనార్హం. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు