జూలైలో పెరిగేది పరిమితమే: రోలోవర్‌ సంకేతాలు

26 Jun, 2020 12:19 IST|Sakshi

నిఫ్టీకి అప్‌ట్రెండ్‌లో 10,500-10,600 శ్రేణి కీలకం

నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం జూలై సీరీస్‌ను భారీ లాభంతో ప్రారంభించింది. ఇదే ఇండెక్స్‌ జూన్‌ సీరిస్‌లో 8శాతం ర్యాలీ చేసింది. ఫ్యూచర్స్ కాంట్రాక్టుల రోలోవర్‌, బిల్డ్‌-అప్‌ పోజిషన్ల తీరును గమనిస్తే ఈ జూలై డెరివేటివ్స్‌ సీరీస్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ ప్రస్తుత స్థాయిల నుంచి స్వల్ప అప్‌సైడ్‌ ట్రెండ్‌ ఉంటుందని మార్కెట్‌ విశ్లేషకులు అంచాన వేస్తున్నారు. జూన్‌ సీరిస్‌ ముగింపు తర్వాత ట్రేడర్లు లాంగ్‌ పొజిషన్లను తీసుకునేందుకు తక్కువ ఆసక్తి చూపారు. దీంతో అధిక స్థాయిల వద్ద బేరిష్‌ పోజిషన్లు బిల్డప్‌ కావచ్చనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా నిఫ్టీ 10,500-10,600 స్థాయిలలో బలమైన నిరోధాన్ని ఎదుర్కోవలసి వస్తుందని వారంటున్నారు.

ఎక్స్‌పైరీ తేదీన నిఫ్టీ రోలోవర్స్‌ 71.6శాతానికి జరిగాయి. ఇది 3నెలల యావరేజ్‌ స్థాయి 69.7శాతం కంటే ఎక్కువ. అయితే కిందట నెల నమోదైన 75.7శాతం కంటే తక్కువగా ఉన్నట్లు ప్రోవిజన్ల గణాంకాలు చెబుతున్నాయి. 

లాక్‌డౌన్‌ ఎత్తివేత అనంతరం ఆర్థిక ‍వ్యవస్థ ఎంత బలపడుతుందనే అనే అంశంపై స్పష్టత లేనందున మార్కెట్ల మరింత పెరగడానికి సంకోచిస్తాయి. ఈ క్రమంలో ప్రస్తు ర్యాలీ తరువాత సూచీలు అధిక స్థాయిలో ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌ అధిక స్థాయిల వద్ద  జాగ్రత్త వహించాలని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. 

కొన్ని అధిక వెయిటేజీ కలిగి స్టాక్‌ డిస్కౌంట్‌ వద్ద ట్రేడ్‌ అవుతుండటంతో నిఫ్టీ జూలై ఫ్యూచర్‌ కూడా డిస్కౌంట్‌లోనే ట్రేడ్‌ అవుతోంది. ఈ జూలై సీరస్‌లో నిప్టీ ఇండెక్స్‌ 9700-10700 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ డెరివేటివ్స్‌ విశ్లేషకుడు చందన్‌ తపారియో అభిప్రాయపడ్డారు. 

10,500-10,600 శ్రేణి నిఫ్టీకి కీలకం:
నిఫ్టీ ఇండెక్స్‌ అప్‌ట్రెండ్‌లో 10,500-10,600 శ్రేణిలో నిరోధాన్ని ఎదుర్కోవచ్చని ఎడెల్వీజ్‌ రీసెర్చ్‌ క్వాంటిటేటివ్‌ రిసెర్చ్‌పర్సన్‌ యోగేశ్‌ రాడ్కే తెలిపారు. ఇక డౌన్‌ట్రెండ్‌లో 10000 స్థాయికి నిఫ్టీ కీలకమని, ఈ స్థాయిని కోల్పోతే 9,700 - 9,400 పరిధికి దిగివచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో రిస్క్‌-ఆన్‌ ట్రేడ్‌ మూమెంటం కొనసాగుతుందన్నారు. ప్రపంచ మార్కెట్ల కదలికలు ఈ జూలై సీరీస్‌కు మార్గనిర్దేశం కానున్నాయని రాడ్కే అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు