లాభపడిన రూపాయి

14 Nov, 2018 02:38 IST|Sakshi

డాలర్‌తో రూ.72.67 వద్ద ముగింపు

ముంబై: డాలర్‌తో రూపాయి మంగళవారం 22 పైసలు పుంజుకుంది. ఫారెక్స్‌ మార్కెట్లో 72.67 వద్ద క్లోజ్‌ అయింది. ఇంట్రాడేలో 72.81– 72.51 స్థాయిలను నమోదు చేసింది. చమురు ధరలు ఇంకాస్త చల్లబడటం, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలకు చేరడం రూపాయికి బలాన్నిచ్చాయి.

బ్యారెల్‌ చమురు 70 డాలర్లకు దిగిపోవడం గమనార్హం. దీంతో కరెంటు ఖాతా లోటుపై ఆందోళనలు ఉపశమించాయి. అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 13 నెలల కనిష్ట స్థాయికి చేరింది. వీటికితోడు విదేశీ నిధుల రాక వంటి అంశాలు రూపాయిపై సానుకూల ప్రభావానికి కారణమయ్యాయి. చమురు ధరల తగ్గుదలను అడ్డుకునేందుకు చమురు ఉత్పత్తికి సౌదీ అరేబియా పిలుపునివ్వడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తప్పుబట్టడం ధరలు దిగిరావటానికి దోహదపడింది.

మరిన్ని వార్తలు