రెండు నెలల గరిష్టానికి రూపాయి

14 Nov, 2018 09:45 IST|Sakshi

చమురు ధరల్లో క్షీణత

8 వారాల గరిష్టానికి రూపాయి

సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ  రూపాయి బుధవారం మరింత బలపడింది. డాలరుమారకంలో  81 పైసలు పుంజుకుని  72 వద్ద 8 వారాల గరిష్టానికి చేరింది.  మంగళవారం 22పైసలు లాభపడి రూపాయి ఈ రోజు మరింత పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించింది. సెప్టెంబరు 21 తరువాత మళ్లీ 72 స్థాయికి రూపాయి బలపడింది.  ప్రస్తుతం 72.09 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.  ముఖ్యంగా అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో డాలరుకు డిమాండ్‌ తగ్గిందని ట్రేడర్లు  తెలిపారు. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 65 డాలర్ల వద్ద  కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు