గెలాక్సీ ఎస్‌9ప్లస్‌ ధర భారీ తగ్గింపు..శాశ్వతంగా

5 Feb, 2019 12:47 IST|Sakshi

శాసంగ్‌ గెలాక్సీ ఎస్‌9ప్లస్‌ ధరలపై శాశ్వత  తగ్గింపు

అన్ని వేరియంట్లపై రూ.7వేలు ధర కోత

సాక్షి,  న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దూసుకుపోయేందుకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ కొత్త ప్రణాళికలతో వస్తోంది. చైనా కంపెనీ షావోమికి దీటుగా ఇటీవల బడ్జెట్‌ ధరల్లో ఎం10, ఎం20 స్మార్ట్‌ఫోన్లను  తీసుకొచ్చిన సంస్థ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ శాసంగ్‌ గెలాక్సీ ఎస్‌9ప్లస్‌ ధరలపై శాశ్వత తగ్గింపును ప్రకటించింది. ఎస్‌9ప్లస్‌ అన్ని వేరియంట్లపై  రూ.7వేల తగ్గింపు అందిస్తోంది. ఈ తగ్గింపు ఆన్‌లైన్‌ విక్రయాలకు మాత్రమే వర్తించనుంది.  

గెలాక్సీ ఎస్‌9 + 64జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 57,900,  దీని లాంచింగ్‌ ధర రూ. 64,900.
128 జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ రూ 61,900.  లాంచింగ్‌ ధర రూ. 68,900
256జీబీ  స్టోరేజ్‌ వేరియంట్‌ రూ 65,900. లాంచింగ్‌ ధర 72,000.  

శాంసంగ్‌ ఆన్‌లైన్‌ అందించిన సమాచారం ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు కొనుగోళ్లపై రూ.4వేల క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది. అలాగే రూ. 9వేల దాకా ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది.  కాగా గెలాక్సీ ఎస్‌ 9ప్లస్‌ను గత ఏడాది ఇండియాలో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు