శాంసంగ్‌ నుంచి సరికొత్త టీవీ

10 Mar, 2018 18:05 IST|Sakshi
సామ్‌సంగ్‌ క్యూఎల్‌ఈడీ టీవీ

సాక్షి : కళ్లకు కట్టినట్టు కనిపించే దృశ్యాలను చూస్తూ ఉండాలని ఎవరికి మాత్రం అనిపించదు.  అలాంటి అనుభూతిని కలిగించేందుకు శాంసంగ్‌ సరికొత్త టీవీలను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.  బ్రిక్స్‌బీ టెక్నాలజీతో  కస‍్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లు, ఎత్తుగడతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. నోటి మాట ద్వారా మనకు నచ్చిన సినిమాలను, పాటలను (టీవీలో అంతర్గతంగా ఉండే బ్రిక్స్‌బీ పరికరం సహాయంతో) ప్లే చేయించవచ్చు.  ఈ అధునాతన టీవీలు  త్వరలోనే  ఇండియన్‌ మార్కెట్లోకి రానున్నాయి.

శాంసంగ్‌ స్మార్ట్‌ వ్యూ యాప్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోని కంటెంట్‌ను  టీవీలో వీక్షించవచ్చు. అదనంగా సరికొత్త ఫీచర్‌తో క్యూఎల్‌ఈడీ టీవీలు  మే నెల చివరికల్లా భారతీయ వినియోగదారులను పలకరించబోతున్నాయి.  త్వరలోనే వీటి ధరలను ప్రకటించనున్నట్లు సామ్‌సాంగ్‌ అధికారులు తెలిపారు. 4కె రిజల్యూషన్‌తో క్యూఎల్‌ఈడీ టీవీలను ఈ ఏడాది ద్వితీయార్థంలో మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నామన్నారు. 85 ఇంచుల తెర, 8కె కృత్రిమ మేధస్సులాంటి ఫీచర్స్‌తో రాబోతున్నట్లు ప్రకటించారు.

 కాగా 2017లో  శాంసంగ్‌ క్యూఎల్‌ఈడీ టీవీలు ఇండియాలో లాంచ్‌ చేసింది.  ఒక్క నెలలోనే విశేషమైన స్పందన వచ్చింది. డిమాండ్‌ పెరిగింది. ఈ డిమాండ్‌ను క్యాష్‌  చేసుకునేందుకు తాజాగా మరింత వేగంగా  దూసుకొస్తోంది.  

మరిన్ని వార్తలు