సెన్సెక్స్‌ 100 పాయింట్లు డౌన్‌..!

10 Jul, 2020 09:28 IST|Sakshi

10800 దిగువున మొదలైన నిఫ్టీ

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ శుక్రవారం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 110 పాయింట్ల నష్టంతో 36627 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు పతనమై 10777 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఫార్మా రంగ షేర్లు తప్ప మిగిలిన​అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.85శాతం నష్టపోయి 22,715.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు మన మార్కెట్‌ నష్టాల ప్రారంభానికి కారణమైనట్లు నిపుణులు భావిస్తున్నారు. పలు రాష్ట్రాలలో కోవిడ్‌-19 కేసులతో పాలు అధిక సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు మరోసారి లాక్‌డౌన్‌ విధించవచ్చే అనుమానాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. ఫలితంగా గురువారం అమెరికా సూచీలు అరశాతం నుంచి 1.50శాతం నష్టాన్ని చవిచూశాయి. నేడు ఆసియాలోనూ ప్రధాన మార్కెట్లన్ని నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక దేశీయ పరిణామాలను పరిశీలిస్తే.., నేడు ఐఐపీ గణాంకాలు విడుదల కానున్నాయి. అలాగే ఐఆర్‌సీటీసీ, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, సెయిల్‌తో పాటు సుమారు 44 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి.

ఇన్ఫ్రాటెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి. భారతీ ఇన్ఫ్రాటెల్‌, రిలయన్స్‌, టాటామోటర్స్‌, సన్‌ఫార్మా, యూపీఎల్‌ షేర్లు 1శాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు