లాభాలకు చెక్‌ : 100పాయింట్ల పతనం

18 Jan, 2019 12:58 IST|Sakshi


సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి  జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు అన్నీ లాభాల్లోనే ఉన్నా అమ్మకాల సెగతో ఆరంభ లాభాలనుంచి నష్టాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా నిఫ్టీ 11వేల పాయింట్లకు చేరువలో ఉండడంతో వరసగా మూడు రోజుల పాటు లాభాలకు చెక్‌పడింది. దీంతో ఈ రోజు కన్సాలిడేషన్‌కు గురవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 36,273 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు క్షీణించి 10874  స్థాయికి  చేరింది. సన్ ఫార్మా ప్రభావంతో హెల్త్‌కేర్ భారీ నష్టాలలో ఉండగా, ఐటీ, టెక్నాలజీ కౌంటర్లు కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తోంది.

విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లు టాప్ గెయినర్స్‌గా ఉండగా, సన్ ఫార్మా,టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, భారతి ఎయిర్‌టెల్, గెయిల్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌పీసీఎల్ షేర్లు టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు