లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

14 Nov, 2019 17:51 IST|Sakshi

ముంబై : ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో స్టాక్‌ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. ఫైనాన్షియల్‌, ఐటీ, ఆటోమొబైల్‌ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు పాజిటివ్‌ జోన్‌లో కొనసాగాయి. ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినా అంచనాలకు అనుగుణంగానే ఉండటంతో డిసెంబర్‌లో ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందనే అంచనా మార్కెట్‌లో సానుకూల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 170 పాయింట్ల లాభంతో 40,286 పాయింట్ల వద్ద ముగియగా, 30 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,870 పాయింట్ల వద్ద క్లోజయింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌ షేర్లు భారీగా లాభపడగా, టెలికాం, మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

మరిన్ని వార్తలు