దేశీయ మార‍్కెట్లకు టర్కీ సెగ

13 Aug, 2018 16:02 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోముగిశాయి. ఆరంభంనుంచీ నష్టాలతో నీరసించిన కీలక సూచీలు వరుసగా రెండవ సోషన్లో కూడా నష్టపోయాయి. సోమవారం ఉదయం  ట్రేడింగ్‌లో ఒకదశలో 300పాయిం‍ట్లకుపైగా నష్టపోయింది. మధ్యలో కొంత కోలుకున్నా చివరికి డబుల్‌ సెంచరీకి పైగా నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌  224 పాయింట్లు నష్టపోయి 37,644 వద్ద నిఫ్టీ 74 పాయింట్ల పతనమై 11355 వద్ద ముగిసాయి. 

టర్కీ ఆర్థిక సంక్షోభం, వర్ధమాన దేశ కరెన్సీల పతనం వంటి అంశాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేసాయి. రూపాయి పతనంతో ఐటీ, ఫార్మ షేర్లలో కొనుగోళ్లధోరణి  కనిపించింది. అయితే బ్యాంకింగ్‌, రియల్టీ బాగా నష్టపోయాయి.

వేదాంతా, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌, ఐబీ హౌసింగ్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, ఐషర్‌, యస్‌బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌  టాప్‌ లూజర్స్‌గా గెయిల్‌  గ్రాసిమ్, టెక్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా, సన్‌ ఫార్మా, సిప్లా, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌  లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు