పీఎన్‌బీ దెబ్బ: నష్టాల్లోకి మార్కెట్లు

27 Feb, 2018 12:36 IST|Sakshi

సాక్షి, ముంబై: ఆరంభ ఉత్సాహంనుంచి స్టాక్‌మార్కెట్లు వెనుకడుగు వేశాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకులలో అమ్మకాలు మార్కెట్లను  ప్రభావితం చేస్తున్నాయి. వీటికితోడు ప్రయివేట్ రంగ బ్యాంకులు, రియల్టీ కౌంటర్లు సైతం బలహీనపడటంతో మార్కెట్లు నష్టాలలోకి  మళ్లాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 94 పాయింట్లు క్షీణించి  34,351వద్ద, నిఫ్టీ 34పాయింట్లు నష్టపోయి 10,549 వద్ద ట్రేడవుతోంది.

ముఖ్యంగా పీఎన్‌బీ స్కాంలో మరో 1300కోట్ల  రూపాయల భారీ లావాదేవీల నేపథ్యంలో మొత్తం రూ.13వేలకోట్ల చేరిందన‍్న ప్రకటనతో ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారి తీసింది. దీంతో పీఎస్‌యు బ్యాంకింగ్‌  షేర్లలో అమ్మకాలకు తెరతీసింది. ముఖ్యంగా పీఎన్‌బీ 9 శాతం కుప్పకూలింది. ఎస్‌బీఐ,యాక్సిస్‌ యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్‌ ఇండియా, ఐడీబీఐ, కెనరా బ్యాంక్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. వీటితోపా టు అంబుజా ఏసీసీ విలీన చర్చలకు బ్రేక్‌ రావడంతో అంబుజా, ఏసీసీ నష్టపోతున్నాయి. ఇంకా ఆర్‌కామ్,  రిలయన్స్‌ నావల్‌, అదానీ పవర్‌, ఐపీఎఫ్‌సీ  నష్టపోతుండగా  పీసీ జ్యువెలర్స్‌, ఐజీఎల్‌, ఐడియా, ఎన్‌సీసీ, కేపీఐటీ, పెట్రోనెట్‌, వొకార్డ్‌, గోద్రెజ్‌ సీపీ, ఐఆర్‌బీ, ఈక్విటాస్‌  లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ఎక్సోరా బిజినెస్ పార్క్ లోని  వాటాను జిఒసికి విక్రయించే చర‍్చల నేపథ్యంలో ప్రెస్టీజ్ ఎస్టేట్స్  వరుసగా  రెండో రోజుకూడా లాభపడుతోంది.
 

మరిన్ని వార్తలు