వడ్డీ రేటు కోత : అమ్మకాల మోత

4 Apr, 2019 16:36 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 25 బేసిస్‌ పాయింట్ల రెపో రేటును తగ్గిస్తూ  ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల నేపథ్యంలో అమ్మకాల జోరు కొనసాగింది. ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు ఊగిసలాటల మధ్య కొనసాగుతూ,  మిడ్‌సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో  ఒక దశలో 200 పాయింట్లకు పైగా పతనమైంది. చివరికి  సెన్సెక్స్‌ 192 పాయింట్లు క్షీణించి 38,685 వద్ద నిఫ్టీ 46 పాయింట్లు బలహీనపడి 11,598 వద్ద స్థిరపడింది.

ఐటీ, మెటల్‌, బ్యాంక్స్‌ భారీగా నష్టపోగా, ఫార్మా, మీడియా, ఆటో లాభపడ్డాయి. ఐబీ హౌసింగ్‌, జీ, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌, బ్రిటానియా, ఎయిర్‌టెల్‌, హీరో మోటో, ఐషర్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలవగా, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్, హిందాల్కో, బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, గెయిల్‌, ఇండస్‌ఇండ్, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఫిన్‌, పవర్‌గ్రిడ్‌ టాప్‌లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు డాలరుతో మారకంలో బలహీనంగా ప్రారంభమైన రూపాయి సైతం 65 పైసలు పతనమై 69 దిగువకు చేరింది.

మరిన్ని వార్తలు