ఫెడ్‌ బూస్ట్‌: 36వేల ఎగువకు సెన్సెక్స్‌

29 Nov, 2018 09:49 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమైనాయి. ట్రేడింగ్‌ ఆరంభంలోనే 300పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ 36వేలను తాకింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 275 పాయింట్లు  ఎగిసి 35,992 వద్ద, నిప్టీ 73 పాయింట్ల లాభంతో  10802 వద్ద కొనసాగుతోంది.  2019లో ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపునకు కొంతమేర బ్రేక్‌ వేయవచ్చన్న అంచనాలు దేశీయ మార‍్కెట్లకు మాంచి జోష్‌ నిచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు కీలక సేచీలు దూకుడు మీద ఉన్నాయి. ముఖ్యంగా సెన్సెక్స్‌36వేలను దాటింది. అటు నిప్టీ కూడా 10800 స్థాయిని అధిగమిచడం విశేషం. దాదాపు అన్ని రంగాలు  లాభాల్లోనే. ఎస్‌బ్యాంకు  మరో 5 శాతం పతనమైంది.

రూపాయి బలపడటంతో ఐటీ మాత్రమే(0.7 శాతం) నష్టపోతోంది. మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్‌ నిఫ్టీ 1.6-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. వేదాంతా, హిందాల్కో, పవర్‌గ్రిడ్, బజాజ్‌ ఫిన్‌, బీపీసీఎల్‌, ఆర్‌ఐఎల్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ, ఐటీసీ 3-1.5 శాతం మధ్యలాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఇన్‌ఫ్రాటెల్‌, ఐవోసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌,యూపీఎల్‌ 2.6-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే నేనవంబర్‌ ఎఫ్‌అండ్‌వో గడువు ముగియనుండటంతో స్వల్పఒడిదొడుకులు ఎదురుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

అటు రూపాయి కూడా డాలరు మారకంలో దృఢంగా ట్రేడింగ్‌ను ఆరంభించింది.గురువారం ఆరంభంలోనే 51పైసలు ఎగిసి 70.11 వద్ద మూడు నెలల గరిష్టాన్ని తాకింది. బుధవారం 70.62వద్ద ముగిసింది.    

మరిన్ని వార్తలు