ఒడిదుడుకులు, 36వేల దిగువకు సెన్సెక్స్‌

27 Dec, 2018 15:56 IST|Sakshi

సాక్షి,ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో భారీ లాభాలతో మొదలైన స్టాక్‌మార్కెట్లు చివరలోలాభాలను కుదించుకున్నాయి.  ముఖ్యంగా  లాభాల స్వీకరణతో తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్‌ 157 పాయింట్లకు, నిఫ్టీ 50 పాయింట్ల లాభాలకు పరిమితమైంది.  అలాగే కీలక సూచీలు  సెన్సెక్స్‌ 36వేలకు దిగువన 35, 807 వద్ద, , నిఫ్టీ 10800 కుదిగువన 10779వద్ద ముగిశాయి.  దాదాపు అన్ని సెక్టార్లు లాభపడగా, మరోసారి చమురు ధర భారీగా పతనం కావడంతో   దాదాపు ఆయిల్‌ రంగ షేర్లన్నీ భారీగా నష్టపోయాయి.

వీటితోపాటు సన్‌ఫార్మా ఎస్‌బ్యాంకు,  యాక్సిస్‌, టాటామోటార్స్‌, టాటా స్టీల్‌,  హీరోమోటో, జేఎస్‌డబ్ల్యూ, ఐషర్‌ మోటార్స్‌, డీఎల్‌ఎఫ్‌,  నష్టపోయాయి.  మరోవైపు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌యూఎల్‌,  ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు