మార్కెట్ల వెనుకంజ : 35వేల కిందికి సెన్సెక్స్‌

17 Oct, 2018 14:43 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు   ఉన్నట్టుండి  నష్టాల్లోకి జారుకున్నాయి.   వరుసగా మూడో రోజు లాభాల శుభారంభం చేసి కీలక సూచీలులో అమ్మకాల ఒత్తిడితో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి.  మిడ్‌ సెషన్‌ తరువాత మార్కెట్లు వెనుకంజ వేశాయి.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 236 పాయింట్లు క్షీణించి 34,926కు చేరగా.. నిఫ్టీ 99 పాయింట్లు తిరోగమించి 10,486  వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ సానుకూలం సంకేతాలతో  సెన్సెక్స్‌ తొలుత 250 పాయింట్లు ఎగసిన సంగతి తెలిసిందే.

ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాలు మాత్రమే స్వల్పంగా లాభపడుతుండగా  పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో, రియల్టీ  నష్టపోతున్నాయి.  ఐబీ హౌసింగ్‌ 9 శాతం కుప్పకూలగా.. బజాజ్‌ ఫైనాన్స్‌, యస్‌బ్యాంక్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అదానీ పోర్ట్స్‌, ఐషర్‌, ఓఎన్‌జీసీ, మారుతీ, ఎంఅండ్‌ఎం టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.మరోపక్క హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌యూఎల్‌, కోల్‌ ఇండియా, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, కొటక్‌ బ్యాంక్, టెక్ మహీంద్రా నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు