-

జీఎస్‌టీని సరళీకరించాలి: ఐఎంఎఫ్‌

9 Aug, 2018 01:57 IST|Sakshi

వాషింగ్టన్‌: సంక్లిష్టమైన జీఎస్‌టీ రేట్లను పాటించడంలోనూ, అమలు చేయడంలోనూ వ్యయాల భారం భారీగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) రేట్లను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని.. రెండు రేట్ల విధానంతో అధిక ప్రయోజనాలుంటాయని పేర్కొంది. భారతపై రూపొందించిన వార్షిక నివేదికలో ఐఎంఎఫ్‌ ఈ అంశాలు ప్రస్తావించింది. 2017 జూలై 1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

భారత్‌ పన్ను సంస్కరణల్లో జీఎస్‌టీ ఒక ’మైలురాయి’ లాంటిదని ఐఎంఎఫ్‌ అభివర్ణించింది. ‘అయితే, పలు శ్లాబులు, మినహాయింపులు మొదలైన వాటితో దీని స్వరూపం సంక్లిష్టంగా ఉంది. రెండు రేట్ల విధానంతో.. పురోగామి స్వభావాన్ని త్యాగం చేయకుండానే అధిక ప్రయోజనాలు పొందేలా దీన్ని సరళతరం చేయొచ్చు‘ అని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటు 7.3 శాతంగాను, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతంగాను ఉండొచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.  

మరిన్ని వార్తలు