ఆదాయపన్ను రద్దు చేయండి!

11 May, 2018 18:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ  వివాదాస్పద ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి తనదైన శైలిలోవ్యాఖ్యలు చేశారు. ఆదాయపు పన్నును రద్దు చేయాలని పిలుపునిచ్చారు. దీని వలన ఎక్కువ మంది పొదుపు చేయడానికి వీలవుతుందని, తద్వారా పెట్టుబడుల పెరుగుదలకు దారితీస్తుందన్నారు.  హైదరాబాద్ హైటెక్స్ లో ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఫ్యూచర్ అఫ్ ఇండియా ఇన్ ఎమర్జింగ్ వరల్డ్ 8వ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం, పేదరికం సమస్యల పరిష్కారానికి దేశం 10 ఏళ్లలో 10 శాతం వృద్ధిరేటు సాధించాలని ఆయన  పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు, స్టార్టప్ కంపెనీలు అధిక పన్ను భారాన్ని మోస్తున్నారన్నారు. చాలా తక్కువమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. ఇది కూడా వేధింపులతో సమానమన్నారు. మధ్య తరగతిపై భారాన్ని తగ్గించేందుకు, వ్యక్తిగత ఆదాయపన్నును రద్దు చేయాలని సూచించారు. అందువల్ల ప్రజల్లో పొదుపు సామర్ధ్యం పెరుగుతుందని, పెట్టుబడులు పుంజుకుంటాయన్నారు.

మరిన్ని వార్తలు