సైరస్‌ మిస్త్రీకి స్వల్ప ఊరట

24 Aug, 2018 13:50 IST|Sakshi

న్యూఢిల్లీ: కార్పొరేట్‌  దిగ్గజం టాటా సన్స్‌, మిస్త్రీ వివాదంలో సైరస్ మిస్త్రీకి పాక్షిక ఉపశమనం లభించింది. టాటా సన్స్ సంస‍్థలో ఆయన వాటాలను విక్రయాలకు  నేషనల్ కంపెనీ లా అప్పెలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీఏటీ) అడ్డకట్ట వేసింది.  తన వాటాలను విక్రయించాల్సింది టాటాసన్స్‌ ఒత్తిడి  తేలేదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్‌జే  ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.  అనంతరం  తుది విచారణను సెప్టెంబర్‌ 24కు వాయిదా వేసింది. 

టాటా సన్స్‌ను ప్రైవేటు కంపెనీగా  మార్పు అంశంపై ఈ కేసులో తుది వాదనల తరువాత నిర్ణయిస్తామని తెలిపింది.  టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపునకు వ్యతిరేకంగా  మిస్త్రీ దాఖలు చేసిన  ఎన్‌సీఎల్‌టీఏటీ స్వీకరించింది.  ఛైర్మన్‌ గా సైరస్  మిస్త్రీ తొలగింపు  సరైనదేనని నేషనల్‌  కంపెనీ లా ట్రిబ్యూనల్‌ ఇటీవల తీర్పు ఇచ్చింది. ఎన్‌ సీఎల్‌ టీలో న్యాయమూర్తులు ప్రకాశ్‌  కుమార్‌, సేనపతిల బెంచ్‌ తీర్పును  సైరస్‌ సవాల్‌ చేశారు. టాటా సన్స్ గత 101 సంవత్సరాలుగా 1917 నుంచీ   టాటా సన్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉందని టాటాసన్స్‌ న్యాయవాది వాదించారు. కాగా గత ఏడాది  టాటా సన్స్‌  ఛైర్మన్‌ పదవినుంచి ఉద్వాసనకు గురైన అనంతరం టాటా గ్రూప్‌లో మెజారిటీ స్టాక్ హోల్డర్స్ మిస్త్రీ కుటుంబం షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ వాటా కొనుగోలు దారుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు