తెలుగు రాష్ట్ర కంపెనీల ఆర్థిక ఫలితాలు

16 Nov, 2015 00:57 IST|Sakshi

తగ్గిన మధుకాన్ లాభాలు
మధుకాన్ ప్రాజెక్ట్స్ సెప్టెం బర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ. 140 కోట్ల ఆదాయంపై రూ. 4 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 255 కోట్ల ఆదాయంపై రూ. 10 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో వడ్డీ భారం రూ. 25 కోట్ల నుంచి 29 కోట్లకు పెరిగింది.
 
నష్టాల్లోనే వైస్రాయ్ హోటల్స్

వైస్రాయ్ హోటల్స్ ఈ త్రైమాసికంలోనూ నష్టాలనే ప్రకటించింది. ఈ మూడు నెలల కాలానికి రూ. 19 కోట్ల ఆదాయంపై రూ. 2.44 కోట్ల నష్టాలను ప్రకటించగా, గతేడాది ఇదే కాలానికి రూ. 20 కోట్ల ఆదాయంపై రూ. 2.55 కోట్ల నష్టాల్లో ఉంది. వడ్డీభారం స్థిరంగా రూ. 6కోట్లుగా ఉంది.

స్టీల్ ఎక్స్ఛేంజ్ ఆదాయం రూ. 427 కోట్లు
స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇం డియా ఈ ద్వితీయ త్రైమాసికంలో రూ. 427 కోట్ల ఆదాయంపై రూ. 7 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి రూ. 388 కోట్ల ఆదాయంపై నికర లాభం రూ. 7 కోట్లు. వడ్డీ భారం పెరగడం లాభాలు తగ్గడానికి కారణంగా కంపెనీ తెలిపింది.
 
తగ్గిన అంబికా ఆదాయం
అంబికా అగర్‌బత్తి ఆదాయంలో స్వల్ప క్షీణత నమోదయ్యింది. గతేడాది ఇదే కాలానికి రూ. 29 కోట్లుగా ఉన్న ఆదాయం ఇప్పుడు రూ. 27 కోట్లకు పరిమితమైంది. లాభాలు రూ. 30 లక్షల నుంచి రూ. 12 లక్షలకు తగ్గాయి.
 
గాయత్రీ ప్రాజెక్ట్స్ నికర లాభం రూ. 7 కోట్లు
సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీ య త్రైమాసికంలో గాయత్రీ ప్రాజెక్ట్స్ రూ. 317 కోట్ల ఆదాయంపై రూ. 7 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 306 కోట్ల ఆదాయంపై రూ. 1.13 కోట్ల లాబాలను ఆర్జించింది. వడ్డీ భారం రూ. 40 కోట్ల నుంచి రూ. 35 కోట్లకు తగ్గింది.
 
కేఎన్‌ఆర్ లాభం రూ. 55 కోట్లు
కేఎన్‌ఆర్ కనస్ట్రక్షన్స్ ఈ మూడు నెలల కాలానికి రూ. 216 కోట్ల ఆదాయంపై రూ. 55 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 170 కోట్ల ఆదాయంపై రూ. 14 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షాకాలంలో వడ్డీ భారం స్థిరంగా రూ. 3 కోట్లుగా ఉంది.
 
స్థిరంగా లోకేష్ మెషీన్స్
లోకేష్ మెషీన్స్ ద్వితీయ త్రైమాసికంలో రూ. 30 కోట్ల ఆదాయంపై రూ. 1.33 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 31 కోట్ల ఆదాయంపై రూ. 77 లక్షల లాభాలను నమోదు చేసింది. సమీక్షా కాలంలో వడ్డీ భారం రూ. 4.47 కోట్ల నుంచి రూ. 3.89 కోట్లకు తగ్గింది.

మరిన్ని వార్తలు