నామినేటెడ్‌కు నో! | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌కు నో!

Published Mon, Nov 16 2015 12:57 AM

నామినేటెడ్‌కు నో! - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీని నిలబెట్టేందుకు పార్టీ అధినేత చ ంద్రబాబు నానా తంటాలు పడుతున్నారు. తెలంగాణలోని కొందరు సీనియర్లకు, పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తున్న నేతలకు కేంద్ర నామినేటెడ్ పదవులు ఇప్పించుకునేందుకు బాబు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. టీ టీడీపీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బాబు వేసిన మంత్రం బీజేపీ అధినాయకత్వం వద్ద పారలేదని వినికిడి. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీలు మిత్రపక్షంగా కలసి పోటీచేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు పార్టీలో కొనసాగేలా చర్యలు తీసుకోలేక పోయారు. ఫలితంగా అయిదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. దీంతో ఉన్న నేతలనన్నా కాపాడుకోవాలంటే వారికి ఏవో కొన్ని పదవులు కట్టబెట్టడం తప్పనిసరని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం భ ర్తీ చేసే నామినేటెడ్ పదవులపై కన్నేసింది.

 రాష్ట్ర నేతలు సిఫారసు చేస్తేనే!
 పార్టీలో సీనియర్‌గా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ టీడీపీకి కీలకం కావడంతో ఆయనకు గవ ర్నర్ పోస్టును ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా, కేంద్ర నామినేటెడ్ పోస్టుల భర్తీ పెద్దగా జరిగింది లేదు. మోత్కుపల్లికి గవర్నర్ పోస్టుతో పాటు మరో ముగ్గురు నాయకులకు కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, రాష్ట్ర బీజేపీ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్ నేతల సిఫారసు తప్పని సరని మోదీ ఖరాఖండిగా చెప్పారని తెలిసింది. ఈ కారణంగానే ఒక్క పోస్టునూ ఇప్పించుకోలేక పోయారని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓడిన వేం నరేందర్‌రెడ్డి, తెలుగు యువత విభాగంలో పనిచేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన నేతకు, మరొక రికి మొత్తంగా నలుగురి కోసం చంద్రబాబు త్రీవంగా ప్రయత్నించారని చెబుతున్నారు.

 నష్ట నివారణకు ప్రయత్నాలు
 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు నాయకులు పట్టుబట్టి వరంగల్‌కు చెందిన వేం నరేందర్‌రెడ్డిని బరిలోకి దింపారు. పార్టీ నయాపైసా ఖర్చు భరించదని చెప్పడంతో అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి, ఆయన మద్దతుదారులు వివిధ మార్గాల్లో డబ్బు సమీకరించుకున్నారు. తర్వా త నరేందర్‌రెడ్డిని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపారు. ఈ వ్యవహా రంలో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కీలకంగా వ్యవహరించి టీఆర్‌ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స న్ కు రూ.50 లక్షల ముడుపులిస్తూ ఏసీబీకి అ డ్డంగా దొరికిపోయారు. పార్టీ పరువును బ జారుకీడ్చిన ఈ ఉదంతంతో పాటు, అభ్యర్థిగా పోటీ చేసిన నరేందర్‌రెడ్డి కేసులో ఇరుక్కున్నారు.

ఆయనకు బాసటగా నిలిచేందుకే కేంద్రం లో నామినేటెడ్ పోస్టును ఇప్పించేందు కు బా బు ప్రయత్నించారని సమాచారం. మరోవైపు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచే తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి కూడా పార్టీతో అంటీముట్టనట్టు ఉండటంతో ఆయనను కోల్పోవడం సబబు కాదని, పార్టీ భవిష్యత్ అవసరాల కోసం గవర్నర్ పోస్టును ఇప్పించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో పోటీ చేసి ఓడిపోయిన పలువురు నాయకులకు ఏపీలో కాంట్రాక్టు పనులు ఇచ్చి కాపాడుతున్నారని పార్టీ వర్గాల సమాచారం.

Advertisement
Advertisement