నేడు పీఎఫ్‌సీలో 5% వాటా విక్రయం

27 Jul, 2015 01:01 IST|Sakshi
నేడు పీఎఫ్‌సీలో 5% వాటా విక్రయం

షేరు కనీస ధర రూ. 254గా నిర్ణయం..
 
 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్‌సీ)లో కేంద్రం నేడు(సోమవారం) 5% వాటాను విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) ద్వారా చేపట్టనున్న ఈ వాటా అమ్మకంలో ఒక్కో షేరుకి కనీస ధర(ఫ్లోర్ ప్రైస్)ను రూ.254గా ఖరారు చేశారు. ఎక్స్ఛేం జీలకు వెల్లడించిన సమాచారంలో పీఎఫ్‌సీ ఈ విషయాన్ని వెల్లడించింది. శుక్రవారం నాటి ముగింపు ధర రూ.259.55(బీఎస్‌ఈలో)తో పోలిస్తే ఫ్లోర్ ప్రైస్ 2.14 శాతం తక్కువ కింద లెక్క. కాగా, ప్రస్తుతం పీఎఫ్‌సీలో ప్రభుత్వానికి 72.8 శాతం వాటా ఉంది. 5 శాతం వాటా అమ్మకం ద్వారా రూ.1,600 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వస్తాయని అంచనా.

మరిన్ని వార్తలు