వచ్చే 6నెలల్లో 26శాతం లాభపడే 7స్టాకులు ఇవే..!

2 Jul, 2020 13:35 IST|Sakshi

ద్వితీయార్థంలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లదే హావా

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సిఫార్సులు

ఈ ఏడాది ద్వితీయార్థంలో 26శాతం వరకు ర్యాలీ చేసే 7స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సిఫార్సు చేసింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, టోరెంటో, నాట్కో, ఎంసీఎక్స్, దీపక్‌ నైట్రేట్‌, ర్యాలీస్‌ ఇండియా, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షేర్లు ఇందులో ఉన్నాయి. ఈ షేర్లన్నీ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ రంగానికి చెందినవి కావడం విశేషం. దాదాపు రెండేళ్ల పాటు బేర్‌ ఫేజ్‌లో ఉన్న విస్తృత మార్కెట్‌ ఇప్పుడు బుల్‌ ఫేజ్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమైనట్లు అనేక ఛార్ట్‌లు సూచిస్తున్నట్లు  బ్రోకరేజ్‌ సం‍స్థ తన నివేదికలో పేర్కోంది. జరగబోయే ఈ  మార్కెట్‌ ర్యాలీలో మిడ్ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ రంగ షేర్ల హావా కొనసాగుతుందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. 

వచ్చే 6నెలల్లో 26శాతం లాభాలన్ని ఇచ్చే 7 స్టాక్‌లు
1. బాలకృష్ణ ఇండస్ట్రీస్‌:  షేరు టార్గెట్‌ ధరను రూ.1535గా నిర్ణయించింది. ఈ ఏడాది చివరి కల్లా 22శాతం ర్యాలీ చేయవచ్చు. ఈ షేరును రూ.1230-1280 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ మొత్తం రూ.24472 కోట్లుగా ఉంది. 
2. టోరెంటో‌: షేరు ఏడాది ద్వితీయార్థంలో 22శాతం ర్యాలీ చేయవచ్చు. షేరుకు టార్గెట్‌ ధర రూ.740గా నిర్ణయించడమైంది. రూ.585-620 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు.కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.23099 కోట్లుగా ఉంది. 
3. నాట్కో ఫార్మా: ఈ షేరును రూ.770 టార్గెట్‌ ధరతో రూ.600-635 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాది రెండో భాగంలో 23శాతం పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 11470 కోట్లుగా ఉంది. 
4. దీపక్‌ నైట్రేట్‌: రానున్న 6నెలల్లో 21శాతం ర్యాలీ చేయవచ్చు. ఈ షేరును రూ.570 టార్గెట్‌ ధరగా రూ.450-485 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ మార్కెట్‌ రూ.6626 కోట్లుగా ఉంది. 
5. ఎంసీఎక్స్‌:  షేరు టార్గెట్‌ ధరను రూ.1515గా నిర్ణయించడమైంది. ఈ ఏడాది చివరి కల్లా 21శాతం ర్యాలీ చేయవచ్చు. ఈ షేరును రూ.1230-1280 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ మొత్తం రూ.6361 కోట్లుగా ఉంది. 
6. ర్యాలీస్‌ ఇండియా: షేరు ఏడాది ద్వితీయార్థంలో 26శాతం ర్యాలీ చేయవచ్చు. షేరుకు టార్గెట్‌ ధర రూ.330గా నిర్ణయించడమైంది. రూ.250-272 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.5208 కోట్లుగా ఉంది. 
7. బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌: ఈ షేరును రూ.470 టార్గెట్‌ ధరగా రూ.370-390 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాది రెండో భాగంలో 23శాతం పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.4489 కోట్లుగా ఉంది. 

ఈ ఏడాది ప్రారంభం నుంచి బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 13శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 9శాతం, సెన్సెక్స్‌ 14శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇదే కాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సిఫార్సు చేసిన 6 స్టాకులు స్థిరంగా రాణించాయి. అందులో అత్యధికంగా ర్యాలీస్‌ ఇండియా షేరు 60శాతం లాభపడింది. అలాగే దీపక్‌ నైట్రేట్‌ 28శాతం, బాలకృష్ట ఇండస్ట్రీస్‌ 28శాతం, ట్రెంట్‌ 17శాతం, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ 11శాతం, నాట్కో ఫార్మా ఇండెక్స్‌ 7శాతం ర్యాలీ చేశాయి. 

మరిన్ని వార్తలు