నేడు మార్కెట్లకు సెలవు

2 Apr, 2020 12:37 IST|Sakshi

సాక్షి,ముంబై:  శ్రీరామ నవమి పండుగ సందర్భంగా నేడు(గురువారం,ఏప్రిల్ 2) దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవు.  బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. ఈ నేపథ్యంలో బులియన్‌, మెటల్‌ తదితర హోల్‌సేల్‌ కమోడిటీ మార్కెట్లకూ సెలవు ప్రకటించారు. కమోడిటీ ఫ్యూచర్స్‌లో సైతం ట్రేడింగ్‌ను అనుమతించరు. ఇక ఫారెక్స్‌ మార్కెట్లయితే నేటితో కలిపి రెండు రోజుపాటు పనిచేయవు. ఏప్రిల్‌ 1(బుధవారం) ఖాతాల వార్షిక(2019-20) ముగింపు రోజు సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్లకు సెలవు.  శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని  ఈక్విటీ మార్కెట్లు పనిచేయవు. ట్రేడింగ్‌ తిరిగి శుక్రవారం(3న) యథావిధిగా ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది. కాగా బుధవారం కీలక  సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి.  కరోనా వైరస్ వ్యాప్తి, విదేశీ మదుపరుల భారీ అమ్మకాల మధ్య  ఆర్థిక సంవత్సరాన్ని నష్టాలతో ఆరంభించాయి. చివరికి1203 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్  28,265 వద్ద,  నిఫ్టీ 344 పాయింట్లు కుప్పకూలి,  8253 వద్ద స్థిరపడినసంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు