లెక్సస్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ@ రూ.99 లక్షలు

4 Oct, 2019 10:21 IST|Sakshi

న్యూఢిల్లీ: టయోటా గ్రూప్‌నకు చెందిన లగ్జరీ వాహనాల తయారీ కంపెనీ ‘లెక్సస్‌’ తాజాగా తన హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ‘ఆర్‌ఎక్స్‌ 450హెచ్‌ఎల్‌’ కారును భారత్‌ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.99 లక్షలు (ఎక్స్‌షోరూం, ఢిల్లీ). అదనపు మూడవ వరుస సీటింగ్‌తో వచ్చిన ఈ  మోడల్‌.. బీఎస్‌–6 ప్రమాణాలతో విడుదలైంది. 3.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన ధరతో ఈ కారు విడుదలైంది’ అని లెక్సస్‌ ఇండియా ప్రెసిడెంట్‌ పీబీ వేణుగోపాల్‌ చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు