విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నికర లాభం రూ. 96.71 కోట్లు

14 Sep, 2019 01:46 IST|Sakshi

ఏజీఎంలో స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ రథ్‌

సాక్షి, విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2018–19లో రూ. 96.71 కోట్ల నికర లాభం ఆర్జించింది.శుక్రవారం జరిగిన సంస్థ 37వ ఏజీఎంలో కంపెనీ  సీఎండి పి.కె.రథ్‌  ఈ వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది రూ. 20,844 కోట్ల టర్నోవర్‌ సాధించి మార్కెట్‌లో 8.80 శాతం వాటాతో అంతకు ముందు ఏడాది కంటే 25 శాతం వృద్ధి నమోదు చేసిందన్నారు. ఆ ఏడాది వడ్డీలు, పన్నులు, తరుగు, రుణ విమోచనలు చెల్లించక ముందు (ఈబీఐటీడీఏ) రూ.1802.91 కోట్లు అర్జన సాధించిందన్నారు (అంతకు ముందు ఏడాది ఈబీఐటీడీఏ రూ. 346.19 కోట్లు) .2017–18లో రూ. 1369.01 కోట్ల నికర నష్టాలు సాధించగా ఆ తర్వాత సంవత్సరం లాభాలు అర్జించడం విశేషం. సమావేశానికి రాష్ట్రపతి ప్రతినిధిగా కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ నీరజ్‌ అగర్వాల్‌ హాజరయ్యారు. సమావేశంలో స్టీల్‌ప్లాంట్‌ డైరెక్టర్లు కె.సి.దాస్, వి.వి.వేణుగోపాలరావు, డి.కె.మొహంతి, కె.కె.ఘోష్‌, స్వతంత్ర డైరెక్టర్లు ఎస్‌.కె. మిశ్రా, సునీల్‌ గుప్తా, అశ్వినీ మెహ్ర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు