సూపర్ నైట్ క్వాడ్‌ కెమెరాతో వివో వీ17

9 Dec, 2019 14:44 IST|Sakshi

సాక్షి, ముంబై:   చైనా మొబైల్‌ తయారీ సంస్థ వీవో  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తన వి సీరిస్‌లో భాగంగా  వివో వి 17 స్మార్ట్‌ఫోన్‌ను  వివో సోమవారం భారత్‌లో విడుదల చేసింది, క్వాడ్  రియర్ కెమెరా, సూపర్ అమోలెడ్ స్క్రీన్‌  "ఐవ్యూ" డిస్‌ప్లేతో వస్తున్న ఈ  స్మార్ట్‌ఫోన్‌ రేటును  రూ .22,990 గా నిర్ణయించింది.

వివో ఇండియా ఇ-స్టోర్, అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్, టాటాక్లిక్, బజాజ్ ఫిన్‌సర్వ్ స్టోర్లతోపాటు అన్ని రిటైల్ దుకాణాల్లో డిసెంబర్ 17 నుండి అందుబాటులో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ ద్వారా జరిపై కొనగోళ్లపై క్యాష్‌బ్యాక్‌ సౌకర‍్యం అందించనుంది. అలాగే సులభ వాయిదాల ద్వారా కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కారణంగా ఇంటెన్సివ్‌గా రోజంతా వాడినా తమ లేటెస్ట్‌స్మార్ట్‌ఫోన్‌లో చార్జింగ్‌ సమస్య వుండదని వివో ప్రకటించింది. అలాగే తక్కువ లైట్లో కూడా మెరుగైన ఫోటోగ్రఫీ కోసం వెనుక కెమెరాలో సూపర్ నైట్ కెమెరాను అమర్చినట్టు తెలిపింది.

వివో వి 17 ఫీచర్లు
6.4 ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675
48+8+2+2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా 
32 ఎంపీ ఫ్రంట్ కెమెరా
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 
4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా