వోల్వో కొత్త కారు, ధరెంతో తెలుసా?

12 Jul, 2017 18:10 IST|Sakshi




న్యూఢిల్లీ :
స్వీడన్‌ ఆటో దిగ్గజం వోల్వో నేడు భారత మార్కెట్‌లో ఓ సరికత్త కారును లాంచ్‌ చేసింది. వీ90 క్రాస్‌ కంట్రీ పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర ఎక్స్‌షోరూంలో 60 లక్షల రూపాయలుగా కంపెనీ పేర్కొంది. ఎస్‌90, ఎక్స్‌సీ90 మాదిరిగానే వీ90 క్రాస్‌ కంట్రీ కారు కూడా కంపెనీ ఎస్‌పీఏ ప్లాట్‌ఫామ్‌పై నియంత్రించబడుతోంది.  ఈ కారులో కొత్త డీ5 ఇంజిన్‌ను,  ఎనిమిది-స్పీడ్ల ఆటోమేటిక్‌ గేర్‌ బాక్స్‌, పలు భద్రతాపరమైన ఫీచర్లను పొందుపరించింది. కారులో ప్రయాణించే వారికోసం పలు ఎయిర్‌బ్యాగ్‌లను, ఎమర్జెన్సీ బ్రేక్‌ అసిస్ట్‌, ఇంటిలిజెంట్‌ డ్రైవర్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్‌, పార్క్‌ పైలట్ అసిస్ట్‌, సిటీ సేఫ్టీ ఇవన్నీ ఈ కారు అందిస్తున్న సేఫ్టీ ఫీచర్లు. నిలువుగా ఉండే ఎల్‌ఈడీ టైల్‌ ల్యాప్స్‌, 20 అంగుళాల అలోయ్‌ వీల్స్‌, రెండు వైపుల స్కిడ్‌ ప్లేట్స్‌, రీడిజైన్‌ బంపర్లు, అల్యూమినియం బ్రష్డ్‌ రూఫ్‌ టైల్స్‌ దీనిలో మిగతా ఫీచర్లు.


కారు లోపల భాగంలో ఫీచర్లను తీసుకున్నటైతే 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్‌ఫోటైన్మెంట్‌ యూనిట్‌ ఈ కారు కలిగి ఉంది. ఎయిర్‌ కండీషన్‌ను కంట్రోల్‌ చేయగల సామర్థ్యం కూడా దీనికి ఉంది. అదేవిధంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆప్లన్లను కంపెనీ అందిస్తోంది.  ప్రస్తుతం ఈ కారుకు భారత్‌లో ఎలాంటి పోటీదారి లేదని తెలుస్తోంది. నేడు లాంచ్‌ చేసిన వీ90 క్రాస్‌ కంట్రీతో సెడాన్‌, ఎస్‌యూవీ సెగ్మెంట్ల కొనుగోలుదారులను ఆకట్టుకోవాలని స్వీడన్‌ కారు తయారీదారి చూస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలవుతుండటం ఇది తమకు మరింత సహకరించనుందని వోల్వో చెబుతోంది. జీఎస్టీతో తమ పన్ను రేట్లు తగ్గాయని చెప్పింది. దీంతో ధరలు కూడా తగ్గిస్తున్నట్టు పేర్కొంది.

మరిన్ని వార్తలు