చదువుకోవడం ఇష్టం లేక.. యువతి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

చదువుకోవడం ఇష్టం లేక.. యువతి ఆత్మహత్య

Published Wed, Jul 12 2017 6:07 PM

Young woman committed suicide in Rangareddy district

రంగారెడ్డి: చదువుకోవడం ఇష్టం లేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జిల్లాలోని పెద్దఅంబర్ పేట్ లో బుధవారం వెలుగు చూసింది. గ్రామ శివారు ప్రాంతంలో గుర్తు తెలియని యువతి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆమె వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా యువతి రాగన్నగూడ పాటిగూడాకు చెందిన మౌనికగా(18) గుర్తించారు. ఈ యువతి ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. చదువుకోవడం ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె వద్ద  లభించిన సూసైడ్ నోట్‌లో రాసింది. ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌లో మౌనిక తల్లిదండ్రులు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement