రూపీ, క్రూడ్‌ ఆయిల్‌ పడగొట్టాయ్‌

4 Sep, 2018 16:01 IST|Sakshi
స్టాక్‌ మార్కెట్లు (ఫైల్‌ ఫోటో)

ముంబై : రూపాయి క్షీణత, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం దేశీయ స్టాక్‌ మార్కెట్లను దెబ్బకొట్టింది. రోజంతా అస్థిరంగా ట్రేడైన స్టాక్‌ మార్కెట్లు, చివరిలో నష్టాలతో సరిపెట్టుకున్నాయి. చివరి గంట ట్రేడింగ్‌లో మరోసారి అమ్మకాల తాకిడి తగిలింది. మార్కెట్‌ ముగింపులో సెన్సెక్స్‌ 155 పాయింట్లు నష్టపోయి 38,157.92 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 11,520 వద్ద క్లోజయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో టాప్‌ గెయినర్లుగా ఇన్ఫోసిస్‌, టెక్‌ మహింద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌, టెక్‌ మహింద్రా టాప్‌ గెయినర్లుగా నిలువగా... ఏసియన్‌ పేయింట్స్‌, ఎస్‌బీఐ, గ్రాసిమ్‌, ఇండియాబుల్స్‌ హౌజింగ్‌ టాప్‌ లూజర్లుగా నష్టాలు గడించాయి. 

డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా భారీగా క్రాష్‌ అయింది. నేటి ట్రేడింగ్‌లో అత్యంత కనిష్ట స్థాయిల వద్ద డాలర్‌కు 71.42 వద్ద సరికొత్త కనిష్ట స్థాయిని నమోదు చేసింది. మరోవైపు పెట్రోల్‌ ధరలు రికార్డు స్థాయిల్లో ఎగిసిపడుతున్నాయి. ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర 16 పైసలు పెరిగి, రూ.86.72గా నమోదైంది. ఇతర నగరాల్లో కూడా ఇదే మాదిరి పెట్రోల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వీటి ప్రభావం ఇటు స్టాక్‌ మార్కెట్లపై చూపింది.

మరిన్ని వార్తలు