మెసేజ్‌ డిలీట్‌ చేయడానికి మరికొంత సమయం

5 Mar, 2018 11:20 IST|Sakshi
వాట్సాప్‌లో మెసేజ్‌ డిలీట్‌ ఫీచర్‌ (ఫైల్‌ ఫోటో)

వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా మెసేజ్‌ ఎవరికైనా పంపితే, ఏడు నిమిషాల వ్యవధిలో దాన్ని డిలీట్‌ చేసేవచ్చు. ఇలా మెసేజ్‌ను డిలీట్‌ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్‌ కొన్ని నెలల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చింది. డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌ పీచర్‌తో సెంటర్‌ తనతో పాటు రిసీవర్‌ వద్ద కూడా మెసేజ్‌ను డిలీట్‌ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఏడు నిమిషాల వ్యవధి సమయాన్ని వాట్సాప్‌ మరింత పెంచింది. చాట్‌లో మెసేజ్‌ను డిలీట్‌ చేయడానికి 4,096 సెకన్ల(68 నిమిషాల 16 సెకన్ల) సమయాన్ని యూజర్లకు కేటాయించింది. అంటే వాట్సాప్‌ యూజర్లకు మెసేజ్‌ డిలీట్‌ చేయడానికి గంట సమయం ఉంటుంది.

ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం అభివృద్ధి చేసిన కొత్త బీటా 2.18.69 వెర్షన్‌లో ఈ వ్యవధిని పెంచింది. వాట్సాప్‌ గురించి ఎప్పడికప్పుడు అప్‌డేట్స్‌ అందించే డబ్ల్యూఏబీటాఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు తీసుకొచ్చిన ఈ ఫీచర్‌, ఐఓఎస్‌, విండోస్‌ ప్లాట్‌ఫామ్స్‌కు కూడా త్వరలోనే అందుబాటులోకి తేనుంది. డిలీట్‌ మెసేజ్‌ ఫీచర్‌ సమయాన్ని పెంచడం మాత్రమే కాక, ఈ కొత్త అప్‌డేట్‌లో స్వల్ప మార్పులు కూడా చేసింది. ఈ బీటాలోనే లాక్డ్‌ రికార్డింగ్‌, స్టికర్‌ ప్యాక్‌ డిస్‌ప్లే సైజ్‌ వంటి ఫీచర్లను కూడా వాట్సాప్‌ తీసుకొచ్చింది. 

>
మరిన్ని వార్తలు