వచ్చే ఏడాది 25.7 బిలియన్‌ డాలర్ల లాభాలు

7 Dec, 2023 06:21 IST|Sakshi

ఈ ఏడాది 23.3 బిలియన్‌ డాలర్లు

విమానయాన రంగంపై ఐఏటీఏ అంచనాలు

తిరిగి సాధారణ స్థాయికి ప్యాసింజర్, కార్గో వృద్ధి

న్యూఢిల్లీ: ప్రయాణికులు, కార్గో విభాగాల వృద్ధి మళ్లీ సాధారణ స్థాయికి తిరిగొస్తున్న నేపథ్యంలో 2024లో అంతర్జాతీయంగా విమానయాన పరిశ్రమ నికర లాభాలు 25.7 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగలవని ఎయిర్‌లైన్స్‌ సమాఖ్య ఐఏటీఏ తెలిపింది. 2023లో ఇది 23.3 బిలియన్‌ డాలర్లుగా ఉండవచ్చని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో అంచనా వేసిన 9.8 బిలియన్‌ డాలర్ల కన్నా ఇది గణనీయంగా ఎక్కువగా ఉండనున్నట్లు వివరించింది. ‘2024లో రికార్డు స్థాయిలో 470 కోట్ల మంది ప్రయాణాలు చేయొచ్చని అంచనా.

2019లో కరోనాకు పూర్వం నమోదైన రికార్డు స్థాయి 450 కోట్ల మందికన్నా ఇది అధికం‘ అని ఐఏటీఏ తెలిపింది. ప్యాసింజర్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ తిరిగి 2019 స్థాయికి చేరుతుండటంతో ఎయిర్‌లైన్స్‌ ఆర్థికంగా కోలుకునేందుకు తోడ్పాటు లభిస్తోందని 2023 సమీక్ష, 2024 అంచనాల నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఐఏటీఏ డైరెక్టర్‌ (పాలసీ, ఎకనామిక్స్‌) ఆండ్రూ మ్యాటర్స్‌ చెప్పారు.  మరోవైపు, ప్రస్తుత ఏడాది కార్గో పరిమాణం 58 మిలియన్‌ టన్నులుగా ఉండగా వచ్చే ఏడాది 61 మిలియన్‌ టన్నులకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.  

2.7 శాతం మార్జిన్‌..
‘అవుట్‌లుక్‌ ప్రకారం 2024 నుంచి ప్యాసింజర్, కార్గో విభాగాల వృద్ధి మళ్లీ సాధారణ స్థాయికి తిరి గి వచ్చే అవకాశం ఉంది. రికవరీ ఆకట్టుకునే విధంగానే ఉన్నా నికర లాభాల మార్జిన్‌ 2.7 శాతానికే పరిమితం కావచ్చు. ఇలాంటి మార్జిన్లు ఏ రంగంలోనూ ఇన్వెస్టర్లకు ఆమోదయోగ్యం కావు‘ అని ఐఏ టీఏ డైరెక్టర్‌ జనరల్‌ విల్లీ వాల్‌‡్ష చెప్పారు. విమానయాన సంస్థలు కస్టమర్ల కోసం ఒకదానితో మరొ కటి తీవ్రంగా పోటీపడటమనేది ఎప్పుడూ ఉంటుందని.. కాకపోతే నియంత్రణలు, మౌలిక సదుపాయాల వ్యయాలు, సరఫరా వ్యవస్థల్లో కొందరి గు త్తాధిపత్యం వంటివి పరిశ్రమకు భారంగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్‌ ఎంతో ఆసక్తికరంగా ఉందని, తాను అత్యంత ఆశావహంగా ఉన్నానని వాల్‌‡్ష తెలిపారు.  ఐఏటీఏలో 300 పైచిలుకు ఎయిర్‌లైన్స్‌కు సభ్యత్వం ఉంది.  

ఐఏటీఏ నివేదికలో మరిన్ని విశేషాలు..
► 2023లో ఎయిర్‌లైన్స్‌ పరిశ్రమ నిర్వహణ లాభం 40.7 బిలియన్‌ డాలర్లుగా ఉండవచ్చు. వచ్చే ఏడాది ఇది 49.3 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చు. 2024లో పరిశ్రమ మొత్తం ఆదాయం 2023తో పోలిస్తే 7.6 శాతం వృద్ధి చెంది 964 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చు.
►ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో కరోనా ప్రభావాల నుంచి భారత్, చైనా, ఆ్రస్టేలియా దేశాల్లో అంతర్గత మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. అయితే, 2023 మధ్య నాటికి గానీ అంతర్జాతీయ ప్రయాణాలపై చైనాలో ఆంక్షలు పూర్తిగా సడలకపోవడంతో ఆసియా పసిఫిక్‌ మార్కెట్‌లో ఇంటర్నేషనల్‌ ప్రయాణికుల రాకపోకలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. ఆసియా పసిఫిక్‌ ప్రాంతం 2023లో 0.1 బిలియన్‌ డాలర్ల నికర నష్టం ప్రకటించవచ్చని, 2024లో మాత్రం 1.1 బిలియన్‌ డాలర్ల నికర లాభం నమోదు చేయొచ్చని అంచనా.
►అంతర్జాతీయంగా ఆర్థిక పరిణామాలు, యుద్ధం, సరఫరా వ్యవస్థలు, నియంత్రణలపరమైన రిసు్కలు మొదలైనవి ఎయిర్‌లైన్స్‌ పరిశ్రమ లాభదాయకతపై సానుకూలంగా గానీ లేదా ప్రతికూలంగా గానీ ప్రభావం చూపే అవకాశం ఉంది.   

>
మరిన్ని వార్తలు