కరోనా ఎఫెక్ట్‌: ఐటీ ఉద్యోగులకు వరం

8 Jun, 2020 19:12 IST|Sakshi

కర్ణాటక: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాండవంతో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొత్త ప్రాజెక్టులు లేక యాజమాన్యాలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంతటి సంక్షోభ పరిస్థితుల్లో కూడా ఐటీ ఉద్యోగులకు కొన్ని సానుకూలతలు ఉన్నాయి. కరోనా వైరస్‌ వల్ల కంపెనీలు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. కంపెనీలు తీసుకున్న నిర్ణయాలే  ఉద్యోగులకు వరంగా మారాయి. ఐటీ కంపెనీలకు వేదికయిన బెంగుళూరు లాంటి పట్టణాల్లో ఇంటి అద్దె ధరలు ఎక్కువగా ఉంటాయి.. కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంటి అద్దె టెన్షన్‌ తీరిందని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

బెంగుళూరులో ఎక్కువ ఐటీ కంపెనీలు ఉండే మహాదేవపుర, వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్స్ సిటీ, బెల్లాండూర్, సర్జాపురలో ఇంటి అద్దెలు అధికంగా వసూలు చేస్తున్నారు. బెంగుళూరులో దాదాపు 85శాతం ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వెసులుబాటు కల్పిస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్‌ 2025సంవత్సరం లోపు మూడో వంతు ఉద్యోగులను ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పిస్తామని పేర్కొంది.
చదవండి: ఐటీ ఉద్యోగులకు అండ..!


 

మరిన్ని వార్తలు