ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6 శాతమే: ప్రపంచ బ్యాంక్‌

14 Oct, 2019 03:58 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత జీడీపీ వృద్ధి రేటు 2019–20 ఆర్థిక సంవత్సరానికి 6 శాతంగానే నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతేడాది నమోదైన 6.8 శాతంతో పోలిస్తే గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. అయినప్పటికీ భారత్‌ ఇప్పటికే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉందని వ్యాఖ్యానించింది. 2021లో 6.9 శాతం, 2021లో 7.2 శాతానికి భారత వృద్ధి రేటు పుంజుకుంటుందని తన తాజా నివేదికలో అంచనా వేసింది. 2018–19లో 6.8 శాతం, 2017–18లో 7.2 శాతంగా జీడీపీ వృద్ధి రేటు నమోదైన విషయం గమనార్హం. ‘ఇటీవల మందగమనం చోటు చేసుకున్నా కానీ.. ఎంతో సామర్థ్యంతో భారత్‌ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉంది. ప్రపంచంలో ఎన్నో దేశాల కంటే భారత వృద్ధి రేటు అధికం.’ అని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ముఖ్య ఆర్థికవేత్త హన్స్‌ టిమ్మర్‌ తెలిపారు. 

>
మరిన్ని వార్తలు