దారుణం: కోడలిపై మామ అత్యాచారం

9 Oct, 2019 10:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : మైనర్ కోడలిపై లైంగి​క దాడి​కి పాల్పడిన 50 ఏళ్ల మామకు మహరాష్ట్ర కోర్టు జీవిత ఖైదును విధించింది. మహరాష్ట్రలోని పాల్‌ఘర్‌ గ్రామానికి చెందిన నిందితుడు ప్రభుత్వ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో రేప్‌ కేసు, పోస్కో చట్టం కింద నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు విచారించిన కోర్టు నిందితుడు నేరానికి పాల్పడినట్టు తేల్చింది. ముద్దాయికి అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎయు కదమ్‌.. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

బాధితురాలైన 15 ఏళ్ల బాలికకు 2015లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదువుతున్న నిందితుడి కుమారుడితో పెళ్లి జరిగింది. భర్త రోజూ కాలేజీ వెళ్లినప్పడు, అత్త కూడా పని నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలిపై నిందితుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీని గురించి ఎవరికైనా చెబితే పెళ్లిని రద్దు చేస్తానని ఆమెను బెదిరించాడు. మామ అకృత్యాల గురించి భర్త, అత్తకు చెప్పినా వారు పట్టించుకోకపోవడంతో తులిన్జీ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడి అఘాయిత్యాలను కోర్టులో నిరూపించడంతో శిక్ష ఖరారైంది.

మరిన్ని వార్తలు