ఏసీబీ వలలో ఎస్‌ఐ

17 Apr, 2018 08:52 IST|Sakshi
ఎస్‌ఐను విచారిస్తున్న ఏసీబీ  అధికారులు(ఇన్‌సెట్‌) ఎస్‌ఐ శ్రీనివాస్‌ 

కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్‌

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన వైనం

మదనపల్లె క్రైం : చౌడేపల్లె ఎస్‌ఐ శ్రీనివాస్‌ రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ  డీఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, సీఐలు చంద్రశేఖర్, విజయశేఖర్, ప్రసాద్‌రెడ్డి కథనం ప్రకారం..పుంగనూరుకు చెందిన దీపక్‌ గతనెల 19న చౌడేపల్లె మండలంలోని బోయకొండ ఆలయానికి స్నేహితులతో వెళ్లాడు. అక్కడ స్థానికులతో గొడవపడ్డాడు. దీపక్, అతని అనుచరులపై కేసు నమోదు చేస్తానని ఎస్‌ఐ చెప్పారు. ఈ క్రమంలో దీపక్‌ ఆందోళనకు గురయ్యాడు.

కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 50వేల రూపాయలు ఇవ్వాలని ఎస్‌ఐ డిమాండ్‌ చేశారు. తొలుత దీపక్‌ ఎస్‌ఐ ఖాతాలోకి రూ.20వేలు డిపాజిట్‌ చేశారు. తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మిగిలిన 30వేల రూపాయలు తీసుకుని సోమవారం రాత్రి మదనపల్లెకు వెళ్లాడు. ఆ మొత్తాన్ని ఎస్‌ఐ శ్రీనివాస్‌ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసి పట్టుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు