ఏసీబీ వలలో మరో అవినీతి చేప

29 Jan, 2018 13:11 IST|Sakshi

దొరికిన డీఈఓ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌

సాక్షి, కొత్తగూడెం: అవినీతి నిరోధక శాఖ వలలో మరో అవినీతి చేప చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం (డి.ఇ.ఓ) కార్యాలయంలో సైదులు అనే వ్యక్తి సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. తమ స్కూల్ రెన్యువల్ కోసం లంచం డిమాండ్‌ చేశారని ఆ పాఠశాల యాజమాన్యం లిఖితపూర్వకంగా ఏసీబీకీ ఫిర్యాదు చేసింది. దీనిపై ఏసీబీ అధికారులు వలపన్ని లంచం తీసుకుంటుండగా వలపన్ని సీనియర్‌ అసిస్టెంట్‌ను  పట్టుకున్నారు. 

మరిన్ని వార్తలు