కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపు.. ఖజానాపై వేల కోట్లలో అదనపు భారం

18 Oct, 2023 16:02 IST|Sakshi

ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి బోనస్‌తో పాటు డియర్‌నెస్‌ అలవెన్స్‌ (dearness allowance (DA)) 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో డీఏ అలవెన్స్‌ 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. 

ఈ ఏడాది మార్చి నెలలో కేంద్ర కేబినెట్‌ ఉద్యోగుల డీఏ అలెవన్స్‌ను 4 శాతానికి పెంచింది. కేంద్ర నిర్ణయంతో 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల మంది పెన్షన్లకు లబ్ది చేకూరుతుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. 

తద్వారా ఏడాదికి ప్రభుత్వ ఖజానాపై ఏకంగా రూ.12,815.60 కోట్ల అదనపు భారం పడనుందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కాగా, ఈ పెంపు జనవరి 01, 2023 నుండి అమలులోకి రానుంది.

డియర్‌నెస్ అలవెన్స్ అంటే..?
ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు. డీఏను మన దేశంలో మొదటిసారిగా 1972లో ముంబై నుంచి ప్రవేశపెట్టారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ డియర్‌నెస్ అలవెన్స్ ఇవ్వడం ప్రారంభించారు.

👉 : Follow the Sakshi TV channel on WhatsApp:

మరిన్ని వార్తలు