రెండోసారి ఆడపిల్ల పుట్టిందని ..

18 Jul, 2018 10:57 IST|Sakshi
మృతిచెందిన పాపను చూపుతున్న మాధవి 

పటాన్‌చెరు టౌన్‌: రెండోసారి ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసిన సంఘటన పటాన్‌చెరు మం డల పరిధిలోని ఇస్నాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. పటాన్‌చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్‌ గ్రామానికి చెందిన మల్లేశ్‌కు, ఇస్నాపూర్‌ చౌరస్తాకు చెందిన మాధవితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మొదట కూతురు పుట్టింది. అనంతరం రెండోసారి కూడా పాప పుట్టడంతో మల్లేశ్‌తన భార్య మాధవిని వదిలేసి వెళ్లాడు.

ఈ క్రమంలో పాప అనారోగ్యంగా ఉండటంతో మాధవి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించగా మంగళవారం ఉదయం పాప మృతిచెందింది. దీంతో మాధవి, కుటుంబ సభ్యులు పాప మృతదేహంతో అత్తింటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మాధవి భర్త మల్లేశ్, అత్తమామలు పరారీలో ఉన్నట్లు సమాచారం. మాధవి తండ్రి పటాన్‌చెరు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు