శ్రీదేవి చనిపోయాక బోనీ ఫస్ట్‌ ఫోన్‌కాల్

27 Feb, 2018 08:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నటి శ్రీదేవి చనిపోయిన రోజు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తేలితే తప్ప ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేలా కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో బోనీ కపూర్‌ను విచారణ చేపట్టాలని దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే కేవలం ఆయన కాల్‌ డేటాను పరిశీలించిన అధికారులు.. కాల్‌ లిస్ట్‌లో ఎక్కువ సార్లు ఎంపీ అమర్‌ సింగ్‌ నంబర్‌ ఉన్నట్లు గుర్తించారు.  

దీనిపై ఓ జాతీయ మీడియా అమర్‌ సింగ్‌ను ఆరా తీసేందుకు ప్రయత్నించింది. ‘అర్ధరాత్రి 12గం.40ని. సమయంలో బోనీ కపూర్‌ నాకు కాల్‌ చేశారు. సెల్‌ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉండటంతో నేను గుర్తించలేకపోయా. తర్వాత నా ల్యాండ్‌ నంబర్‌కు ఫోన్‌ చేశారు. ‘బాబీ ఇక లేదు’ అని గద్గద స్వరంతో ఆయన నాకు చెప్పారు. అయితే అది మాట్లాడే తరుణం కాదనుకుని ఫోన్‌ పెట్టేశాను. బహుశా ఆ వార్త బోనీ మొదట చెప్పింది నాకే అయి ఉండొచ్చని భావిస్తున్నా’ అని అమర్‌ సింగ్‌ పేర్కొన్నారు. 

‘శ్రీదేవి-బోనీ కుటుంబంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. ఇది నిజంగా ఎవరూ ఊహించని ఘటన. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఇలా జరిగింది. వారికి ఎలాంటి అప్పులు లేవు. ఆర్థికంగా వారి పరిస్థితి ఇప్పుడు బాగానే ఉంది’ అని అమర్‌ సింగ్‌ తెలిపారు. ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే... శ్రీదేవి చనిపోయే ముందు రోజు బోనీ కపూర్‌, అమర్‌సింగ్‌లు లక్నోలో ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు హజరు అయ్యారు. అయితే అక్కడ అమర్‌ సింగ్‌కు అవమానం జరగటంతో ఆయన బహిష్కరించి ఢిల్లీకి వెళ్లిపోగా.. బోనీ శ్రీదేవి సర్‌ప్రైజ్‌ డిన్నర్‌ కోసం దుబాయ్‌ వెళ్లినట్లు ఆ కథనం ఉటంకించింది. 

ఇక ఇప్పటిదాకా కేవలం ఆయన కాల్‌ డేటాను పరిశీలించిన దుబాయ్‌ పోలీసులు అసలు బోనీ కపూర్‌ను విచారణే చేపట్టలేదని ఖలీజ్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. ఆదివారం మృతదేహానికి పరీక్షలు నిర్వహించే సమయంలో కేవలం ఎలా జరిగింది అన్న వివరణ తీసుకుని బోనీని హోటల్‌కు పంపించేశారంట. కేసు ప్రాసిక్యూషన్‌ విభాగానికి అప్పజెప్పిన నేపథ్యంలో నేడు ఇంటరాగేషన్‌ కోసం బూర్‌ దుబాయ్‌ పోలీస్‌ స్టేషన్‌కు రావాల్సిందిగా బోనీని కోరినట్లు సమాచారం. 
శ్రీదేవికి మద్యం అలవాటు లేదు
 

మరిన్ని వార్తలు