సిగరెట్‌ అడిగితే ఇవ్వలేదని..

1 Oct, 2019 08:55 IST|Sakshi
శ్యామ్‌ (ఫైల్‌), నిందితుడు పొన్‌రాజ్‌  

సాక్షి, చెన్నై : మద్యం మత్తులో ఉన్న వ్యక్తి సిగరెట్‌ తీసివ్వడానికి నిరాకరించిన యువకుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన తిరువళ్లూరు పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు పట్టణంలోని మేట్టుకాలనీకి చెందిన శ్యామ్‌ అలియాస్‌ శ్యామ్‌వేల్‌(20) ఆదివారం అర్ధరాత్రి తన స్నేహితులతో కలిసి అదే ప్రాంతంలోని లాల్‌బహుదూర్‌ శాస్త్రీ వీధిలో వెళుతున్నాడు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న పొన్‌రాజ్‌ శ్యామ్, అతని స్నేహితులను పిలిచి తనకు సిగరెట్‌ కావాలని కోరాడు. అయితే ఇందుకు నిరాకరించిన శ్యామ్‌ స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో పొన్‌రాజ్‌కు శ్యామ్‌కు మధ్య ఘర్షణ జరిగింది.

దీంతో ఆగ్రహించిన పొన్‌రాజ్‌.. సిగరెట్‌ ఇవ్వని నీకు బతికే అర్హత లేదంటూ కత్తితో శ్యామ్‌ను దారుణంగా పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్యామ్‌ను స్థానికులు, స్నేహితులు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. 

వెంటనే అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. మృతి చెందిన విషయం తెలియడంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు నిందితుడి కారును దగ్ధం చేసి నానా రసాభా సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. తిరువళ్లూరు టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మళ్లీ.. మళ్లీ కాల్‌

కుమార్తెపై లైంగిక దాడి.. ఏడేళ్ల జైలు

వీడిన హత్య కేసు మిస్టరీ

ఇనుమును బంగారంగా నమ్మించి

రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని..

వీళ్లు సామాన్యులు కాదు..

తన భార్య వెంట పడొద్దన్నందుకు..

అర్ధరాత్రి నకిలీ టాస్క్‌ఫోర్స్‌..

రూపాయి దొంగతనం; వాతలు పెట్టిన తల్లి

రుణం ఇవ్వడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం

మహిళపై మాజీ కార్పొరేటర్‌ దాడి

ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్తున్నారా.. 

కొత్తపేటలో భారీ చోరీ

మహిళా దొంగల ముఠా హల్‌చల్‌

ఇదే నా చివరి వీడియోకాల్‌..

బాలికపై లైంగికదాడికి యత్నం

అండగా ఉన్నాడని హత్య

ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది దుర్మరణం

వామ్మో – 163

మోదీ హత్యకు కుట్ర: యువకుడు అరెస్టు

శవమైన వివాహిత

వీఐపీల ఫోన్‌ డేటా ఆమె గుప్పిట్లో

చిన్నారులను కాపాడి అన్న, చెల్లెలు మృతి

ఐఎంఎస్‌ స్కాంలో మరొకరు అరెస్టు

దైవదర్శనానంతరం మృత్యుకౌగిలికి.. 

ఈఎస్‌ఐ స్కాంలో మరొకరి అరెస్ట్‌

మైనర్‌ బాలిక ‘అమ్మ’ అయింది.. బిడ్డను వదిలేసింది

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

శునకం తెచ్చిన శోకం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పరిపూర్ణం కానట్లే: సమంత  

భాషతో పనేంటి?

విజయ్‌ వర్సెస్‌ విజయ్‌

సై సైరా... భయ్యా!

కనుల పండువగా సంతోషం

మీ ప్రేమను తిరిగి ఇచ్చేస్తా