హైదరాబాద్‌లో సీబీఐ దాడులు

3 Jan, 2020 10:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌కు చెందిన ఆరుగురు అధికారుల ఇళ్లలో  సీబీఐ శుక్రవారం సోదాలు నిర్వహించింది. సినీఫక్కీలో తప్పుడు పత్రాలతో పాటు, లేని మనుషులను ఉన్నట్లుగా చూపి బ్యాంక్‌ నుంచి రుణాలు పొందిన భారీ మోసం వెలుగు చూసింది. రీన్‌ లైఫ్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో  కొందరు ఎస్‌బీఐ ఉన్నత ఉద్యోగులు ముఠాగా ఏర్పడి రూ.16 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారనే అభియోగాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు అధికారులు కలిసి డబ్బులు డ్రా చేసినట్లు సీబీఐ గుర్తించింది. హైదరాబాద్‌,మైసూర్‌,బెంగుళూరులో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. పలు ఆధారాలను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు