రెట్టింపు ఇస్తామని 100 కోట్ల మోసం

20 Oct, 2019 04:58 IST|Sakshi

చెన్నైలో దంపతుల అరెస్టు

సాక్షి ప్రతినిధి, చెన్నై: పెట్టిన పెట్టుబడికి వంద రోజుల్లో రెట్టింపు ఇస్తామంటూ జనానికి గాలం వేసి రూ.100 కోట్లకు పైగా బురిడీ కొట్టిన దంపతులను తమిళనాడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. సేలం రెడ్డిపట్టి అంబేద్కర్‌నగర్‌కు చెందిన మణివణ్ణన్‌ (38), ఇందుమతి (33) దంపతులు తమ బంధువులతో కలిసి సేలం–ఓమలూరు రోడ్డులో ఆర్‌ఎంవీ గ్రూప్‌ సంస్థ ప్రారంభించారు. తమ సంస్థలో డబ్బు డిపాజిట్‌ చేస్తే వంద రోజుల్లో రెట్టింపు, మరింత కాలం డిపాజిట్‌గా ఉంచితే 25 శాతం వడ్డీ చెల్లిస్తామని ఆశచూపారు.

పోగైన భారీ సొమ్ముతో మణివణ్ణన్‌ ఫొటోలు దిగి డిపాజిట్‌దారులకు పంపేవాడు. భారీగా సమకూరిన కోట్లాది రూపాయలతో మణివణ్ణన్‌ దంపతులు గత ఏడాది ప్రారంభంలో దుబాయ్‌కు పారిపోయారు. లబోదిబోమంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందిన దంపతులు రెండు రోజుల క్రితం సేలంకు రాగా పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు.  దంపతుల నుంచి రెండు లగ్జరీ కార్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, 13 సెల్‌ఫోన్లు, రెండు బంగారు గాజులు, పది సవర్ల బంగారు చైను, రూ.50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌ ఖాతాల వివరాలను సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సేకరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఘరానా దొంగ.. ఢిల్లీ మోడల్‌తో ప్రేమాయణం

నవవధువు ఆత్మహత్య

కొత్తజాలారిపేటలో కలకలం

ప్రేమ..పగ.. రెండు జీవాలు.. రెండు కుటుంబాలు

పద్మ ఆత్మహత్యాయత్నం

రూమ్‌ బాయ్‌పై సురభి హోటల్‌ యజమాని దాడి

అమ్మాయిని కలిసేందుకు వచ్చాడని...

ఈఎస్‌ఐ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ ఆత్మహత్యాయత్నం

ర్యాంప్‌ వాక్‌ చేస్తూ 21 ఏళ్ల యువతి మృతి

టిక్‌ టాక్‌ వీడియో.. నలుగురిపై కేసు

మహిళా టీచర్‌పై ఇంటి ఓనర్‌ కొడుకు..

సాగర్‌ కాల్వ నుంచి స్కార్పియో వెలికితీత

ఖాళీ చెక్కు ఇచ్చి బురిడీ!

హిందూ సమాజ్‌ నేత దారుణ హత్య

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం 

కేటీఆర్‌ సంతకం ఫోర్జరీ.. నిజమే!

ఎర్రచందనం స్వాధీనం: ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు

స్నేహితులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని ఆత్మహత్య

ప్రియురాలి ఇంట్లో ఎఫ్‌బీవో ఆత్మహత్య ?

‘కల్కి’ ఆస్తులు రూ.500 కోట్లు పైనే!

టెంట్‌హౌస్‌లో అక్రమ మద్యం పట్టివేత

బాలిక కిడ్నాప్‌.. పట్టించిన రూ. 5 భోజనం

విధి ఆడిన ఆట

కుటుంబం ఉసురు తీసిన దీపావళి గిఫ్టులు

భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

ఆస్తి కోసం అమానుషం

సాగర్‌లోకి స్కార్పియో..ఆరుగురు గల్లంతు 

సంచలనం : ఢిల్లీ స్పీకర్‌కు ఆరు నెలల జైలు

తూర్పు గోదావరిలో బాణాసంచా పేలుడు కలకలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెంటిమెంట్‌ను వదలని అజిత్‌

రాయ్‌లక్ష్మి కోసం ఆ ఇద్దరు

ఫలితాన్ని పట్టించుకోను

అందరూ లైక్‌ చేస్తున్న పాట

పాట.. మాట.. నటన

నూటొక్క జిల్లాలకే అందగాడు