వైద్యానికి వస్తే.. ప్రాణం పోయింది

18 Aug, 2018 10:04 IST|Sakshi
 సంధ్య మృతదేహం, పిల్లి సంధ్య (ఫైల్‌)

కోల్‌సిటీ(రామగుండం): జ్వరం వచ్చిందని ఓ మహిళ ఆస్పత్రికి వస్తే... ప్రాణమే పోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం చోటు చేసుకుంది. వైద్యులు వేసిన ఇంజక్షన్లు వికటించడంతోనే మృతి చెందిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఆగ్రహంతో ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు... పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లి గ్రామానికి చెందిన నిరుపేద పిల్లి వేణుగోపాల్, సంధ్య(25) దంపతులు. వీరికి ఐదు సంవత్సరాల కూతురు ఉంది. సంధ్యకు వారం రోజులుగా జ్వరం వస్తుండడంతో, ఈనెల 10న రామగుండం వీక్లీ మార్కెట్‌ సమీపంలోని తన పుట్టింటికి వచ్చింది. స్థానికంగా ఆర్‌ఎంపీల దగ్గర వైద్యం చేయించినప్పటకీ తగ్గకపోవడం, వాంతులు అవుతుండడంతో, గురువారం గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

శుక్రవారం కూడా జ్వరం తగ్గకపోవడంతో ఆస్పత్రి డాక్టర్‌ సూచనల మేరకు సిబ్బంది వరుసగా నాలుగైదు ఇంజక్షన్లు వేశారు. కాసేటికి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన ఆస్పత్రి డాక్టర్, స్థానికంగానే మరో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు కూడా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కరీంనగర్‌లోని మరో కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలోకి తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేసిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని వెల్లడించారు. సంధ్య మృతి చెందడానికి గోదావరిఖనిలో తొలత చేర్పించిన ప్రైవేట్‌ ఆస్పత్రి డాక్టర్‌ ఇచ్చిన ఇంజక్షన్లు వికటించడంతోనేనని ఆరోపించారు.

మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశా రు. మృతిరాలి కటుంబానికి న్యాయం చెయ్యాలని, ఆస్పత్రిని మూసివేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆగ్రహంతో ఆస్పత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. వన్‌టౌన్‌ సీఐ వాసుదేవరావు, ఎస్సై ఉపేందర్‌రావు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, దాడులకు పాల్పడడం సరికాదని హెచ్చరించారు. చివరికి కొందరు పెద్దలు జోక్యం చేసుకొని ఆస్పత్రి వైద్యులు, మృతురాలి బంధువులతో చర్చలు జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమ్మను వేధిస్తే.. అంతే! 

భర్త హత్య కేసులో భార్యే నిందితురాలు

హెచ్‌సీయూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఎన్నారై అనుమానాస్పద మృతి

అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..

మలేషియా జైల్లో మనోళ్లు బందీ

అవమానాలు భరించ లేకున్నా.. వెళ్లిపోతున్నా..

మత్తులో కత్తులతో వీరంగం!

మోసగాడు.. ఇలా దొరికాడు

ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..

ప్రేమ జంటలే టార్గెట్‌

‘ఆ ఊహనే భరించలేకున్నా.. చనిపోతున్నా’

వివాహేతర సంబంధమా.. వ్యాపారుల మధ్య పోటీయా..?

ట్రాక్టర్‌ డ్రైవర్‌ దారుణహత్య

హిజ్రా చంద్రముఖి ఫిర్యాదు..

వందల కోట్లు లంచంగా ఇచ్చా

భర్త, కుమారుడిని వదిలేసి సహజీవనం.. ఆత్మహత్య

బాలికపై సామూహిక లైంగికదాడి

ఇంటి పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం

కుప్పంలో దొంగనోట్ల ముఠా!

ఎంపీ గల్లా అనుచరులపై కేసు

అనసూయ పేరుతో అభ్యంతరకర పోస్టులు

ప్రేమ వ్యవహారమేనా..?

సౌదీలో పరిచయం.. తమిళనాడులో సంబంధం

బ్యూటీషియన్‌ దారుణ హత్య

అమెరికాలో పూజారిపై దాడి

హైదరాబాద్‌కు ఐసిస్‌ నమూనాలు!

ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌పై మరో కేసు

షేక్ సద్దాంను హత్య చేసిన నిందితుల అరెస్ట్‌

ఉపాధ్యాయుల ఇళ్లలో భారీ చోరీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌